మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్..ల సినిమాలు ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసేవి. ఈ నలుగురు హీరోలు ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. అయితే వీరిలో నెంబర్ 1 హీరో ఎవరంటే అంతా చిరంజీవి పేరే చెబుతారు. కానీ చిరు కంటే ముందే బాలయ్య కొన్నాళ్ల పాటు నెంబర్ 1 హీరోగా కొనసాగే వారు. కానీ ఆ తర్వాత సుమన్ వచ్చి అతన్ని డామినేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో చిరు వచ్చి సుమన్ ను, బాలయ్య ను వెనక్కి నెట్టారు.
సుమన్ త్వరగానే ఫేడౌట్ అయిపోగా బాలయ్య మాత్రం నెంబర్ 2ప్లేస్ లో కొనసాగుతూ వచ్చారు. ఇక వెంకీ, నాగ్ లు 3,4 ప్లేసుల్లో కొనసాగేవారు. అయితే పవన్, మహేష్, ప్రభాస్ వంటి నెక్స్ట్ జనరేషన్ మొదలయ్యాక వీరి హవా తగ్గింది. చిరంజీవి కొన్నాళ్ళు నెట్టుకొచ్చినా.. ఆ తర్వాత ఆయన పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడంతో.. పవన్, మహేష్, చరణ్ లు పుంజుకున్నారు. అప్పటి నుండి సీనియర్ స్టార్ హీరోలంతా వెనుకపడ్డారు. అయితే చిరు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నెంబర్ 1 హీరో అతనే అని ఆ సినిమాల కలెక్షన్లు నిరూపించాయి.
కానీ ‘సైరా’ ‘ఆచార్య’ వంటి చిత్రాలు చిరుని వెనక్కి నెట్టాయి. నిన్న రిలీజ్ అయిన ‘గాడ్ ఫాదర్’ మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం చిరు ప్రేక్షకులను అట్రాక్ట్ చేయలేకపోతున్నారు అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. మొదటి రోజు ‘గాడ్ ఫాదర్’ మూవీ రూ.16.68 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక నాగార్జున ఘోస్ట్ అయితే రూ.2.42 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ఇక వెంకీ ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలతోనే వస్తున్నాడు. సోలోగా వెంకీ నటించిన ఏ చిత్రం కూడా మొదటి రోజు రూ.10 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయలేకపోయింది. అయితే బాలకృష్ణ ‘అఖండ’ చిత్రం మాత్రం మొదటి రోజు రూ. 18.04 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఈ రకంగా చూస్తే సీనియర్ స్టార్ హీరోల్లో ఒక్క బాలయ్యకి మాత్రమే బాక్సాఫీస్ స్టామినా ఉందని స్పష్టమవుతుంది. చిరు, నాగ్, వెంకీ వంటి హీరోలు మల్టీస్టారర్స్ తో వస్తే తప్ప బాక్సాఫీస్ పై సత్తా చాటే అవకాశాలు లేవని తెలుస్తుంది. అలా అని బాలయ్య మిగిలిన డైరెక్టర్లతో చేసే సినిమాలు ‘అఖండ’ రేంజ్ వసూళ్లను సాధిస్తున్నాయి అని చెప్పలేం. కానీ బోయపాటి కాంబోలో ఆయన సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుంది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న మూవీ కనుక హిట్ అయితే ‘గాడ్ ఫాదర్’ ను మించి కలెక్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు.