‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా రిలీజ్ అయ్యాక నాగవంశీ ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ‘నా సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా కలెక్షన్స్ బాగా వచ్చాయి. రివ్యూల వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. రివ్యూలు చూసి మోసపోయి సినిమాలు చూడటం మానేయకండి’ అంటూ ప్రేక్షకులకు విన్నవించుకున్నాడు. అటు తర్వాత ‘సినిమా హిట్టయినా, కలెక్షన్స్ వస్తున్నా.. ఎందుకు మీ రివ్యూలు కరెక్ట్ చేసుకోవడానికి ట్వీట్లు వేస్తున్నారు’ అంటూ మీడియాపై మండిపడ్డాడు నాగవంశీ(Suryadevara Naga Vamsi). అక్కడితో ఆగలేదు.. ‘మీకు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా…
నా సినిమాని మీరు ప్రమోట్ చేయకండి, ఆర్టికల్స్ రాయకండి, నేను యాడ్స్ ఇస్తేనే మీ సైట్లు రన్ అవుతున్నాయి.. మీరు నా సినిమా గురించి రాయకండి.. నా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు’ అంటూ ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. అంతేకాదు నాగవంశీ మీడియా కోసం ప్రెస్ షోలు వేయడం కూడా మానేశాడు. తర్వాతి రోజు ఫ్యామిలీ మొత్తానికి షోలు వేసి.. నెగిటివ్ రివ్యూలు అరికట్టాలని ప్రయత్నించాడు. అయితే ఇప్పుడు ‘రెట్రో’ (Retro) విషయంలో అతని వ్యాఖ్యలు మీడియా సీరియస్ గా తీసుకుందేమో అనిపిస్తుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చాలా వరకు మీడియా దూరంగా ఉంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇష్యూ తప్ప.. ఈవెంట్ కి సంబంధించిన మిగిలిన అంశాలు ఏవీ హైలెట్ అవ్వలేదు. ఇవన్నీ చూసే అనుకుంట ‘రెట్రో’ కి ప్రెస్ షో కూడా వేశారు. మరోపక్క ఆ సినిమాకి నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. దీనిని కవర్ చేయడానికి మధ్యాహ్నం టైంకి నాగవంశీ ఒక ప్రెస్ మీట్ పెడుతుంటారు. కానీ ఈసారి అలాంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. ఇవన్నీ చూసి నాగవంశీ జాగ్రత్త పడతారేమో చూడాలి.