అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) ఒకప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత ‘రణం’ తో (Ranam) దర్శకుడు కూడా అయ్యాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇతనికి పెద్ద ఆఫర్లు వచ్చాయి. కానీ తర్వాత సినిమాలు ప్లాప్ అవడంతో నిలబడలేకపోయాడు. అప్పట్లో ఇతని వ్యవహార శైలిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. అమ్మ రాజశేఖర్ సెట్స్ లో అందరినీ తిట్టిపోసేవారు అంటూ కొందరు చెప్పుకొచ్చారు. ఓ హీరోయిన్ ను కూడా అమ్మ రాజశేఖర్ అందరి ముందు తిట్టి పోసినట్టు ప్రచారం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించి క్లారిటీ కూడా ఇచ్చాడు.
అతను మాట్లాడుతూ… “ఒక హీరోయిన్ ని 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ముందు మీరు తిట్టారని, ఆమె అందరి ముందు ఏడ్చింది అని అప్పట్లో ఓ టాక్ ఉంది. దాని గురించి చెప్పండి’ అంటూ యాంకర్ అమ్మ రాజశేఖర్ ను (Amma Rajasekhar) ప్రశ్నించాడు. అది ‘రణం’ సినిమాలో అని కూడా యాంకర్ చెప్పడం జరిగింది. కానీ అందుకు అమ్మ రాజశేఖర్… ‘రణం’ సినిమాలో నేను హీరోయిన్ కామ్నా జెఠ్మలానీని (Kamna Jethmalani) తిట్టలేదు. పైగా ఆ సినిమాకు నేను దర్శకుడిని కూడా..!
ఎలా తిడతాను.? ఒక సాంగ్ విషయంలో చిరాకు పడినట్టు ఉన్నాను. అయితే నేను వేరే హీరోయిన్ ను తిట్టడం జరిగింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు. రవీనా టాండన్..! గతంలో నాగార్జున- రవీనా టాండన్ (Raveena Tandon) కాంబినేషన్లో ‘ఆకాశవీధిలో’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా షూటింగ్లో భాగంగా రవీనా టాండన్ ఓవర్ ఆటిట్యూడ్ చూపించింది. అప్పుడు నేను ఆమెను అందరి ముందు మందలించడం జరిగింది.
నాగార్జున (Nagarjuna) వంటి స్టార్ హీరో స్టెప్పులు గురించి ఏమీ అనకుండా చేస్తుంటే.. ఆమె మార్చమని చెప్పింది. నేను మార్చనని చెప్పాను. అప్పుడు నాగార్జున గారు ఎందుకు.. పెద్ద హీరోయిన్ కదా మార్చు అని చెప్పారు. కానీ నేను తగ్గలేదు. నాగార్జున గారు నాకు బాగా క్లోజ్” అంటూ చెప్పుకొచ్చాడు అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar). ఇక రవీనా టాండన్ ‘కె.జి.ఎఫ్ 2’ (KGF 2) వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.