రాజ్ తరుణ్ కుక్కుల వెంట పడుతున్నాడు!

టాలీవుడ్ లో రోజురోజుకి జంతువుల డిమాండ్ పెరిగిపోతుంది. మొన్నేమో.. రాజమౌళి ఈగ, నిన్న రవిబాబు పంది, ఈరోజు రాజ్ తరుణ్ కుక్క. ఈ జంతువుల పేర్లేంటి అనుకుంటున్నారా..? యువ హీరో రాజ్ త‌రుణ్ కుక్క‌ల వెంట పడుతున్నాడట. కుక్క‌ల్ని కిడ్నాప్ చేసి, య‌జ‌మానుల ద‌గ్గ‌ర్నుంచి డ‌బ్బులు పిండుకొంటున్నాడు. అంటే.. కుక్క‌ల కిడ్నాప‌ర్ అన్న‌మాట‌.

రాజ్ త‌రుణ్ క‌థానాయ‌కుడిగా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. దొంగాట ఫేమ్ వంశీకృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ కుక్క‌ల్ని కిడ్నాప్ చేసి, డ‌బ్బులు సంపాదిస్తుంటాడ‌ట‌. అంతేకాదు.. కుక్క‌ల‌తో మాట్లాడుతుంటాడ‌ట‌. ఓ కుక్క‌… రాజ్ త‌రుణ్ జీవితాన్నే మ‌లుపు తిప్పుతుంద‌ట‌. ఏంటో ఈ కాన్సెప్ట్ కాస్త వెరైటీగా ఉంది. నిజానికి రాజ్ తరుణ్ కి పెంపుడు కుక్కలు అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ బ్రీడ్స్ కు చెందిన 20 కుక్కల్ని మన హీరో పెంచుకుంటున్నాడు. ఈ సినిమా కోసం రాజ్ తరుణ్ పెంచుకుంటున్న తన పెంపుడు కుక్కల్ని తెరపై చూపించే అవకాశాలు లేకపోలేదు. మ‌రి ఈ కొత్త కాన్సెప్ట్ ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus