దూకుడు సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న నిర్మాతలు

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమా దూకుడు రిలీజ్ అయి అప్పుడే ఐదేళ్లు అవుతోంది. 2011 సెప్టెంబర్ 23 విడుదలైన ఈ సినిమాతో 14 రీల్స్ ఎంటైర్ టైన్మెంట్ బ్యానర్ కి మంచి గుర్తింపు లభించింది. నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకరలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. సిరులు కురిపించిన ఆరోజుని మరిచిపోకుండా.. ఆ తేదీనా తమ కొత్త చిత్రం హైపర్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. రామ్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ పాటలను వినూత్నంగా నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. ఒక్కో పాటను ఒక్కో వేదికపై విడుదల చేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ట్రైలర్ ను కూడా మహేష్ బాబు సినిమా విడుదలైన రోజున రిలీజ్ చేసి మరింత హైప్ తీసుకు రానున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నేను శైలజ తో హిట్ కొట్టిన ఎనర్జిటిక్ హీరో రామ్ ఈ చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు బరిలో దిగుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus