ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలైన మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) , డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలు గురువారం రోజునే థియేటర్లలో విడుదల కావడంతో ఈ సినిమాలు లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థల వివరాలు సైతం వెల్లడయ్యాయి. డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా మిస్టర్ బచ్చన్ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా ఈ రెండు ఓటీటీలు సినిమా విడుదలైనా నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తాయి. ఈ రెండు సినిమాలు నాలుగు వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతాయో అంతకంటే ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతాయో తెలియాల్సి ఉంది. ఈ రెండు సినిమాలలో మాస్ ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలు మాస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఈ రెండు సినిమాల బడ్జెట్ 200 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాల కలెక్షన్లు సైతం అదే రేంజ్ లో ఉంటాయో లేదో చూడాల్సి ఉంది. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కావడం ఈ రెండు సినిమాలకు ప్లస్ అవుతోంది. రవితేజ (Ravi Teja) , రామ్ (Ram) రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రావాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హరీష్ శంకర్ (Harish Shankar) , పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఒకేరోజు రెండు వేర్వేరు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఇద్దరు దర్శకులకు సోషల్ మీడియా వేదికగా ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. రామ్, రవితేజ పారితోషికాలు సైతం దాదాపుగా సమానంగా ఉండటం గమనార్హం.