మహేష్ అభిమానులకి కి దేవిశ్రీ భరోసా…?

మహేష్ బాబు- దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఇప్పటి వరకూ మొత్తం 4 సినిమాలు వచ్చాయి. అవే ‘1 నేనొక్కడినే’ ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ చిత్రాలు. వీటిలో మొదటి మూడు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అయితే ‘మహర్షి’ చిత్రానికి మాత్రం దేవి ఆశించిన స్థాయిలో మ్యూజిక్ సక్సెస్ కాలేదు. దీంతో అభిమానులు కూడా కాస్త నిరుత్సాహానికి గురయ్యారనే చెప్పాలి. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ పేరు అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ వద్దంటూ గోల చేశారు.

అయితే దేవిశ్రీ ప్రసాద్ మాత్రం అదిరిపోయే ట్యూన్స్ ఇస్తానని ఓ రేంజ్ లో భరోసా ఇచ్చాడు. ‘ఈ చిత్రంలో వచ్చే మాస్ సాంగ్ ప్రతి పార్టీలో వినబడేలా ఉంటుందని, లవ్ సాంగ్ అంటే ప్రతి లవర్ ని ఆకర్షించేదిగా ఉంటుందని’ దేవి శ్రీ ప్రామిస్ చేసాడు. అయితే టైటిల్ ట్రాక్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదనే చెప్పాలి. మరి మిగిలిన పాటలు కూడా అలాగే ఉంటాయా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాత అనిల్ సుంకర దేవి శ్రీ.. సినిమా ఓపెనింగ్ డే చెప్పిన వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. మరి ఆయన ట్వీట్ లో ఎంత వరకూ నిజం ఉందో చూడాల్సి ఉంది..!

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus