‘మాస్టర్’ టు ‘కె.జి.ఎఫ్’.. టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 డబ్బింగ్ సినిమాలు..!

  • June 1, 2022 / 06:03 PM IST

అప్పట్లో తమిళ్ డబ్బింగ్ సినిమాలు తెలుగులో స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేవి. తమిళ్ సినిమాలు అనే కాదు మలయాళం సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేవి. దాంతో డబ్బింగ్ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయకూడదు అంటూ వివాదాలు కూడా తలెత్తాయి. అది కాస్త తెలుగులో క్రేజీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ కాకూడదనే రాజీకి వచ్చింది. ఆ తర్వాత మొత్తానికి మర్చిపోయారు అనుకోండి. ఎందుకంటే తెలుగు బయ్యర్స్ కూడా ఎగబడి డబ్బింగ్ రైట్స్ తీసుకోవడం.. తక్కువ రేట్లకే సినిమాలను కొనుక్కున్నాం కదా అని రెంట్ పద్దతిలో ఎక్కవుగా థియేటర్లకు విడుదల చేసి క్యాష్ చేసుకోవడం వంటివి చేసేవారు. పండుగల టైములో కూడా డబ్బింగ్ సినిమాలు డామినేట్ చేసేవి.

నిజానికి తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే డబ్బింగ్ సినిమానా, స్ట్రైట్ సినిమానా అని చూడరు అందుకే డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో మంచి వసూళ్లను సాధిస్తూ ఉంటాయి. అయితే పాండమిక్ తర్వాత డబ్బింగ్ సినిమాలు చాలా తక్కువ మోతాదులోనే రిలీజ్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) మాస్టర్ :

విజయ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్ కానగరాజన్ డైరెక్ట్ చేశాడు. తమిళ్ లో ఈ సినిమా అంతంత మాత్రమే ఆడింది. కానీ తెలుగులో మాత్రం ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీ బాగానే నచ్చింది.

2) ఎనిమి :

విశాల్ హీరోగా ఆర్య విలన్ గా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

3)వరుణ్ డాక్టర్ :

శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

4) ది కాశ్మీర్ ఫైల్స్ :

ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయలేదు. కానీ ఓటిటిలో తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేశారు. ఓటిటిలో తెలుగు వెర్షన్ కు మంచి పేరొచ్చింది. చాల మంది ఈ మూవీని వీక్షిస్తున్నారు.

5) కన్మణి రాంబో కటీజా :

విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ప్రమోషన్లు ఏమీ చేయకపోయినా ఈ మూవీ ఇక్కడ బాగానే ఆడింది.

6) మహాన్ :

విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులని బాగా అలరించింది.

7) జై భీమ్ :

సూర్య హీరోగా నటించిన ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభించింది. థియేటర్లో కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఈ మూవీని ఇంకా ఎగబడి చూసేవారు ప్రేక్షకులు.

8) కురుప్ :

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది.

9) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ఏకంగా ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్షన్లనే అధిగమించింది.

10) డాన్ :

శివ కార్తికేయన్ నటించిన ఈ డబ్బింగ్ మూవీ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎటువంటి ప్రమోషన్ వంటిది చేయకపోయినా, ‘సర్కారు వారి పాట’ వంటి పెద్ద సినిమా పక్కన రిలీజ్ అయినా సినిమా బాగానే ఆడింది.

ఇవి మాత్రమే కాదు ‘ఆహా’ లో విడుదలైన ‘దొంగాట’, ‘రైటర్’ వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే త్వరలో రాబోతున్న కమల్ హాసన్ విక్రమ్ మూవీ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు కూడా నటించారు. అలాగే ‘చార్లీ’ అనే చిత్రం పై కూడా అంచనాలు బానే ఉన్నాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus