జెస్సీ గేమ్ కి పుల్ స్టాప్ పడిందా..? ఈవారం ఎలిమినేషన్ ఉందా లేదా?

బిగ్ బాస్ హౌస్ నుంచీ జస్వంత్ జెస్సీ బయటకి వచ్చేస్తున్నాడు. గత కొద్దివారాలుగా వర్టిగో ఇష్యూతో బాధపడుతున్న జెస్వంత్ జెస్సీ ని ఎట్టకేలకి బిగ్ బాస్ టీమ్ చికిత్సకోసం బయటకి పంపించేస్తోంది. లాస్ట్ టైమ్ గంగవ్వ ఎలాగైతే హెల్త్ ఇష్యూవల్ల బయటకి వచ్చిందో , నోయల్ కాలినొప్పితో ఎలాగైతే బయటకి వచ్చాడో సేమ్ టు సేమ్ అలాగే వర్టిగో తో జెస్సీ ఇంటి నుంచీ బయటకి రాక తప్పడం లేదు. ఒకవేళ, రెండు మూడు రోజుల్లో రికవరీ అయితే స్పెషల్ కేస్ లో మళ్లీ జస్వంత్ ని రీ ఎంట్రీ ఇప్పిస్తారు. లేదంటే మాత్రం వీకెండ్ స్టేజ్ పైన నాగార్జున ఫార్మలిటీగా ఎలిమినేట్ చేసి పంపించేస్తారు.

అయితే, ఇప్పుడు ఈవారం నామినేషన్స్ లో జస్వంత్ లేడు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ కూడా ఆడే పొజీషన్ లో కూడా లేడు. అంతేకాదు, ఈవారం జెస్సీ ఇంటి నుంచీ వెళ్లిపోతే డేంజర్ జోన్ లో ఉన్నవాళ్లు సేఫ్ అయినట్లే లెక్క అవుతుంది. అప్పుడు నో ఎలిమినేషన్ చేస్తే ఈవారం నామినేషన్స్ లోకి వచ్చినవాళ్లు బచాయించినట్లే.  బిగ్ బాస్ హౌస్ లోకి 8వ కంటెస్టెంట్ గా వచ్చిన జెస్సీ ఇంటి నుంచీ బయటకి వెళ్లాల్సిన టైమ్ వచ్చిందని బిగ్ బాస్ ఎనౌన్స్ చేయగానే ఎమోషనల్ అవుతూ బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ లో మిగతా హౌస్ మేట్స్ కి ఈవిషయం చెప్పగావే వాళ్లు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.

సిరి అయితే కన్నీరు పెట్టుకుంటూ మరీ జస్వంత్ ని బయటకి పంపించింది. షణ్ముక్, సిరి, జస్వంత్ ముగ్గురూ కూడా కార్నర్ బ్యాచ్ గా, మోజ్ రూమ్ బ్యాచ్ గా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాళ్లలో ఒకరు ఇలా హెల్త్ ఇష్యూవల్ల బయటకి వెళ్లిపోవడంతో చాలా బాధపడ్డారు. ఇదంతా రీసంట్ గా వచ్చిన ప్రోమోలో చూపించాడు బిగ్ బాస్. సిరి అయితే జెస్సీని గట్టిగా పట్టుకుని మరీ ఏడ్చేసింది.

హౌస్ అంతా బరువైన గుండెతో జెస్సీని సాగనంపిన ఈ ప్రోమో ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. మరోవైపు జెస్సీ వెళ్లిపోతే ఈవారం ఎలిమినేషన్ ఉండదని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేశారు. అయితే, ఇప్పుడు తన ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత జెస్సీ తిరిగి బిగ్ బాస్ హౌస్ కి వస్తాడా ? ఎలిమినేట్ అయిపోతాడా అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus