Roja: ఆ హీరోతో గొడవకు కారణం సౌందర్యనే అంట.. అస‌లేం జ‌రిగిందంటే!

హీరో విక్టరీ వెంకటేష్ ఒకప్పటి హీరోయిన్ లేడీ ఫైర్ బ్రాండ్ రోజా మధ్య కొన్ని సంవత్సరాలుగా మాటలు లేవన్న ప్రచారం ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది. అసలు దీనికి కారణం ఏంటి ? వీరిద్దరి మధ్య గొడవ వెనక ఏం జరిగింది అన్నది ఆసక్తికరమే. ఈ విషయాన్ని వెంకటేష్ మేక‌ప్‌మ్యాన్‌ రాఘవ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వీరిద్దరి కాంబినేషన్లో పోకిరి రాజా అనే సినిమా వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయింది.

ఆ తర్వాత కొన్నాళ్ల‌కు వెంకటేష్ హీరోగా రాజా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తమిళం నుంచి రీమేక్ చేశారు. తమిళ్ వెర్షన్ లో రోజా హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని ముందుగా అనుకున్నారు. ఆ విషయాన్ని రోజా దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో వెంకటేష్ పక్కన తానే హీరోయిన్ అని రోజా ఫిక్స్ అయిపోయారు. అప్పట్లో వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్లో వరుసగా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

దీంతో దర్శక, నిర్మాతలు మార్కెట్ పరంగా వెంకటేష్ – సౌందర్య జోడికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని సౌందర్యను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే కావాలనే వెంకటేష్ తనను తప్పించి సౌందర్యను హీరోయిన్‌గా పెట్టుకోవాలని దర్శ‌క, నిర్మాతలకు చెప్పినట్టు రోజా ఫీల్ అయ్యారట. అయితే వాస్తవంగా ఈ విషయంలో వెంకటేష్‌కు ఏమాత్రం సంబంధం లేదని రాఘవ చెప్పారు.

ఆ తర్వాత కొన్ని సినిమా ఫంక్షన్లో వెంకటేష్ పక్కన కూర్చునేందుకు కూడా (Roja) రోజా ఇష్టపడలేదు. అలా వారిద్దరి మధ్య అనుకోకుండా గ్యాప్ పెరిగిందని… దీనికి తోడు మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు కూడా వారిద్దరి మధ్య గ్యాప్‌ మరింత పెంచాయ‌ని రాఘవ చెప్పారు. ఆ త‌ర్వాత వెంక‌టేష్ – రోజా కాంబినేష‌న్లో సినిమాలు రాలేదు. ఇప్పుడు వీళ్లిద్దదూ ఫ్రెండ్స్ అయ్యారనుకోండి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus