Tagore Movie: ‘ఠాగూర్’ మేనియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఏంటో తెలుసా..?

‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి అభిమానుల ఆకలి తీర్చిన మెగాస్టార్ చిరంజీవి… ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ అనే మూవీ చేసిన సంగతి తెలిసిందే. 2003 వ సంవత్సరం సెప్టెంబర్ 24న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓ అభిమాని దర్శకుడు అయ్యి.. తన అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ అలా ఉంటుంది అని చెప్పవచ్చు. తమిళంలో మురుగదాస్ తెరకెక్కించిన ‘రమణ’ చిత్రానికి ఇది రీమేక్. కానీ ఆ చిత్రానికి దీనికి చాలా మార్పులు కనిపిస్తాయి.

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు దర్శకుడు వి.వి.వినాయక్ ‘ఠాగూర్’ లో చాలా మార్పులు చేశాడు. క్లైమాక్స్ కూడా మార్చాడు.కాబట్టి ఎక్కడా కూడా రీమేక్ సినిమా చూశామనే ఫీలింగ్ కలుగదు.నిజానికి వినాయక్ చేసిన ఆ మార్పులే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణమయ్యాయి అని చెప్పొచ్చు. ఈరోజుతో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సినిమా పక్కన కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

అవేంటంటే.. మంచు విష్ణు హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన ‘విష్ణు’ మూవీ ‘ఠాగూర్’ రిలీజ్ అయిన 4 రోజులకి అంటే సెప్టెంబర్ 28 న రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది . ఆ తర్వాత తరుణ్- శ్రీయ ల కాంబోలో వచ్చినా క్రేజీ మూవీ ‘ఎలా చెప్పను’, కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన ‘తొలి చూపులోనే’, దివంగత స్టార్ కమెడియన్ ఏవీఎస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓరి నీ ప్రేమ బంగారం కాను’ వంటి సినిమాలు ‘ఠాగూర్’ బాక్సాఫీస్ మేనియాలో కొట్టుకుపోయాయి అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus