Brahmamudi August 28th: కావ్యను భార్యగా అంగీకరించిన రాజ్!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే…అపర్ణ ఆజ్ఞ మేరకు దుగ్గిరాల కుటుంబసభ్యులు ఎవరూ కూడా కావ్యతో మాట్లాడటానికి ఇష్టపడరు కావ్య అందరికీ టీ తీసుకొని రాగా అందరూ కూడా తనని అవాయిడ్ చేస్తూ వస్తారు.ఇక ఆపర్ణ కిందికి వస్తుండగా కావ్య వెళ్ళి తనకు టీ ఇస్తుంది. దాంతో కావ్య ధాన్య లక్ష్మి మన ఇంట్లో పనులు మనమే చేసుకోగలము వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేయడానికి వీల్లేదు అంటూ ఇన్ డైరెక్ట్ గా చెబుతుంది.

అపర్ణ అలా మాట్లాడటంతో కావ్య అంటే ఇంట్లో అందరూ నాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారా అనుకొని అక్కడ నుంచి వెళ్తుంది. మరోవైపు అప్పు కళ్యాణ్ బైక్ రోడ్డుపై వేలం వేస్తూ ఉంటుంది. అది చూసిన కళ్యాణ్ ఏం చేస్తున్నావ్ బ్రో ఇది నా బైక్ అనడంతో మరి ఇక్కడ వదిలేసి వెళ్ళినప్పుడు నీకు గుర్తు లేదా అంటూ అప్పుడు మాట్లాడుతుంది. దాంతో కళ్యాణ్ అక్కడ వేలం పాటకు వచ్చిన వారందరినీ పంపించి బైక్ తీసుకొని బైక్ మీద ఇద్దరు వెళ్తారు. అప్పు అనామిక గురించి అడగడంతో కళ్యాణ్ జరిగినది మొత్తం చెప్పగా నవ్వుకుంటుంది. అంతలోనే బైక్ పాడవడంతో ఇద్దరు ఆటోలో వెళ్తారు.

కావ్య ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకుని గదికి వెళుతూ ఉండగా రుద్రాణి అడ్డుపడుతుంది. కావ్య దగ్గరకు వచ్చిన రుద్రాణి తనతో మాట్లాడుతూ నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటిమా వదిన కాళ్ల దగ్గర పడి క్షమాపణలు కోరీ బానిసగా ఈ ఇంట్లో బ్రతకడం లేదంటే మీ పుట్టింటికి వెళ్లి మట్టి తీసుకుంటూ బ్రతకడం అంటూ రుద్రాణి కావ్యను అవమానిస్తూ మాట్లాడుతుంది. దాంతో కావ్య మీరు మూడో ఆప్షన్ చెప్పడం కూడా మర్చిపోయారు. మూడో ఆప్షన్ సహనం నేను సహనంతో అన్ని ఎదుర్కొంటాను మీరు ఇలా మాట్లాడటం మా అత్తగారు కనుక చూశారు అనుకోఈ మూడింటిలో నీకు ఏ ఆప్షన్ ఉండదు అంటూ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోగా నువ్వు ఈ ఇంట్లో సహనంతో ఉంటావా ఎలా ఉంటావో నేను చూస్తాను అని రుద్రాణి అనుకుంటుంది.

మరోవైపు స్వప్న తాను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఎలా అంటూ కంగారు పడుతుంది.తన డాక్టర్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న రాలేదు మరో రెండు రోజుల తర్వాత చేసుకోమంటావా అని అడగడంతో నువ్వు రెండు రోజుల తర్వాత చేసుకున్న నీకు ప్రెగ్నెన్సీ రాదు ప్రెగ్నెన్సీ రావాలి అంటే నువ్వు మరోసారి రాహుల్ తో కమిట్ అవ్వాలి. నాకు అంత టైం లేదనీస్వప్న చెప్పడంతో ఒకటి రాహుల్ తో కమిట్ అవ్వడం లేదా పొట్ట పెద్దదిగా కనిపించేలాగా ప్రయత్నించు అంతేకానీ నా తల మాత్రం తినొద్దు అంటూ డాక్టర్ ఫ్రెండ్ చెబుతుంది దాంతో స్వప్న నా పొట్ట పెద్దదిగా కనపడాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

మరోవైపు రాజ్ తన గదిలో డిజైన్స్ గీస్తూ ఉండగా వెళుతుంది. రాజ్ ను మాట్లాడించిన తను మాట్లాడడు దాంతో ఇద్దరు కూడా పేపర్ పై వ్రాస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు.ఇలా రాజ్ కంగారు పడటం చూసి ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని కావ్య శృతికి ఫోన్ చేయడంతో శృతి జరిగినది మొత్తం చెబుతుంది. అలాగే ఆ డిజైన్స్ తనకు మెయిల్ చేయమని చెబుతుంది. మరోవైపు పొట్ట పెద్దదిగా కనిపించడం కోసం స్వప్న ఏకంగా ఐదు కిలోల బిర్యానీ ముందు పెట్టుకుని తినడం చూసిన ధాన్య లక్ష్మి షాక్ అవుతుంది. తరువాయి ఎపిసోడ్ లో రాజ్ కావ్య ఇద్దరు ఏదో విషయం గురించి వాదించుకుంటూ ఉంటారు. నీతో నాకు వాదన ఏంటి నువ్వు నా భార్యవు అంటూ మాట్లాడటంతో కావ్య సంతోషపడుతుంది.

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus