మంచి సినిమాకి కలెక్షన్ కరువయ్యాయి!

కొన్ని సినిమాలకు ఎందుకనో టాక్ వచ్చినంత బాగా కలెక్షన్స్ రావు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు ఉంటున్నాయి ఈమధ్యకాలంలో కొన్ని సినిమాల రిజల్ట్స్. సినిమా చాలా బాగుంది అని టాక్ వచ్చినా సరైన కలెక్షన్స్ సాధించలేక ఢీలాపడిన చిత్రం “సమ్మోహనం”. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు-అదితిరావు హైదరీ జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి క్లాస్ సినిమా అని టాక్ వచ్చినా అటు ఓవర్సీస్ లో కానీ.. ఇటు మల్టీప్లెక్స్ లో కానీ ఆశించిన స్థాయి కలెక్షన్స్ మాత్రం లేవు. శని, ఆదివారాలు మరీ తక్కువ కలెక్షన్స్ నమోదయ్యాయి. పెద్ద పెద్ద సినిమాలకే సోమవారం, మంగళవారం కలెక్షన్స్ ఉండవు ఇక “సమ్మోహనం”కి ఉంటాయన్న నమ్మకం లేదు. అయితే.. వచ్చేవారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో ఈవారం వరకూ సమ్మోహనం లాక్కురావచ్చు. సుధీర్ బాబు కెరీర్ లో మంచి సినిమాగా మాత్రం సమ్మోహనం మిగిలిపోతుంది.

మరి ఇలాంటి సినిమాలకు ఎందుకని కలెక్షన్స్ ఉండడం లేదు అనే ప్రశ్నకి మాత్రం విశ్లేషకుల దగ్గర కూడా సమాధానం ఉండడం లేదు. కానీ.. ఈ తరహా సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీకి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి లేదంటే అవే రొట్ట సినిమాలు, అవే మాస్ మసాలా సినిమాలు చూస్తూ సొంత జబ్బలు చరుచుకుంటూ ఉండిపోవాలి. ఈ విషయాన్ని మన తెలుగు ప్రేక్షకులు కాస్త పట్టించుకుంటే బెటర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus