టాలీవుడ్ రాజకీయ సినిమాల్లో ‘యాత్ర’ ఓ ప్రత్యేక సినిమా అని చెప్పొచ్చు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రతో మొదలుకుని, ఆయన సీఎం అయ్యేవరకు అందులో అన్ని (?) విషయాలు పొందుపరిచారు దర్శకుడు మహి.వి.రాఘవ్. మూడేళ్ల క్రితం ఆయన ‘యాత్ర 2’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని చూపిస్తానని చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి చర్చ లేదు. అయితే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ చెప్పిన ఓ సమాధానం ఆ సినిమాను మళ్లీ వార్తల్లోకి తీసుకొచ్చింది.
‘యాత్ర’ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా ప్రముఖ మలయాళీ నటుడు మమ్ముట్టి నటించిన విషయం తెలిసిందే. మరి వైఎస్ తనయుడు జగన్ మీద సినిమా అంటే.. అందులో హీరోగా దుల్కర్ ఉంటే ఎలా ఉంటుంది అనే ప్రశ్న కొన్ని రోజుల క్రితం వినిపించింది. ఇదే విషయాన్ని దుల్కర్ దగ్గర మీడియా ప్రస్తావిస్తే ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ‘‘మీ నాన్న వైఎస్ఆర్ బయోపిక్‌లో నటించారు. మరి మీకు వైఎస్ జగన్ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే చేస్తారా?’’ అని అడిగారు.
దాని దుల్కర్ స్పందిస్తూ.. ‘‘నాకు ఆ సినిమా స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా నటిస్తాను. ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు ఆ సినిమాలో నేను కనిపిస్తాను. ఆ స్క్రిప్ట్ ఎంతవరకు జనాలకు కనెక్ట్ అవుతుంది. ఇలాంటి విషయాలపై క్లారిటీగా నా దగ్గరకు సినిమా వస్తే తప్పకుండా నటిస్తాను’’ అని చెప్పాడు దుల్కర్. అంతేకాదు తనకు ఇక్కడ రాజకీయాల గురించి అస్సలు తెలియదని, కాబట్టి మేకర్స్ కూడా నన్ను సంప్రదించే అవకాశం ఉంది. కేరళ నుంచి వచ్చాను కాబట్టి ఎవరి సైడ్ తీసుకోకుండా ఆలోచిస్తానని టీమ్ అనుకోవచ్చు అని దుల్కర్ చెప్పారు.
దీంతో మహి. వి.రాఘవ్ మనసులో వైఎస్ జగన్ పాత్రకు ఇంకా ఎవరినీ ఓకే చేసుకోకపోతే.. జగన్‌గా దుల్కర్ పనికొస్తారేమో ఆలోచించొచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా ‘యాత్ర 2’ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు దుల్కర్ వల్ల ఈ టాపిక్ బయటకు వచ్చింది కాబట్టి సినిమా మీద ఏదైనా అప్డేట్ రావొచ్చు అని సమాచారం.