మలయాళ స్టార్ హీరో బాలీవుడ్ సినిమా!
- October 20, 2017 / 08:26 AM ISTByFilmy Focus
“ఒకే బంగారం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కు తెలుగుతోపాటు, తమిళంలోనూ భారీ క్రేజ్ ఉంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు కావడమే కాక అద్భుతమైన నటుడు కూడా కావడంతో అడపాదడపా అతడు నటించిన కొన్ని మలయాళ చిత్రాలు తెలుగులో డబ్ అవుతుంటాయి. అయితే.. తెలుగు, తమిళం, మలయాళం మాత్రమే కాకుండా హిందీ అనగా బాలీవుడ్ మీద కూడా కన్నేశాడు దుల్కర్. రీసెంట్ గా దుల్కర్ నటించిన “సోలో” ఒక ఎక్స్ పెరిమెంట్ అయినప్పటికీ దుల్కర్ నటనను ఆదరించినట్లుగా.. సినిమాను ఆదరించలేకపోయారు జనాలు. ఆ విషయంలో కాస్త ఎక్కువగానే ఫీల్ అయిన దుల్కర్ ఫేస్ బుక్ లో ఒక పది పేజీల లేఖను పోస్ట్ చేయడం అది కూడా చర్చనీయాంశమవ్వడం జరిగింది.
కట్ చేస్తే.. దుల్కర్ ఇప్పుడు మలయాళంలో కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదట. అందుకు కారణం తన మార్కెట్ ను పెంచుకోవాలనుకోవడమే. అందుకోసమే బాలీవుడ్ లో ఒక సినిమా సైన్ చేశాడట. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అక్కినేని నాగార్జున సతీమణి అమల కూడా ఈ చిత్రంలో నటిస్తోందట.












