Pawan Kalyan: ఫుల్‌ జోష్‌లో పవన్‌ ఫ్యాన్స్‌… ‘ఓజీ’ అప్‌డేట్‌ కోసం నానా హంగామా?

సినిమాల్లో ఎంత డైనమిక్‌గా ఉన్నారో.. ఇప్పుడు పాలిటిక్స్‌లోనూ అంతే డైనమిక్‌గా ఉన్నారు పవన్‌ కల్యాణ్‌. ప్రజలకు ఇబ్బంది పెడుతున్నవాళ్లను, రాష్ట్రానికి హానికరంగా మారిన వాళ్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌లు, అంతకంటే స్ట్రాంగ్‌ యాక్షన్లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కాకినాడ పోర్టు నుండి పేదల బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్న నౌకను పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ ఓడ గురించి, దాని వెనుక కారకుల గురించి ప్రశ్నిస్తూ ‘సీజ్‌ ది షిప్‌’ అని అన్నారు.

Pawan Kalyan

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఇన్‌ ‘ఓజీ’ (OG Movie) మోడ్‌ అంటూ ఫ్యాన్స్‌, నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. పనిలోపనిగా ‘ఓజీ’ సినిమా అప్‌డేట్‌ ఇవ్వండి అంటూ డీవీవీ మూవీస్‌ ట్విటర్‌ హ్యాండిల్‌ను ట్యాగ్‌ చేస్తున్నారు. దీంతో ఇది వాళ్ల సోషల్‌ మీడియా టీమ్‌కి తీపి తలనొప్పిగా మారింది అని చెప్పాలి.

ఎందుకంటే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ ‘ఓజీ’ అప్‌డేట్‌ కోసం చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం ‘ఓజీ’ షూటింగ్‌ మళ్లీ మొదలైంది అంటూ ఓ ట్వీట్‌ వేశారు. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగా ఓ పాట వస్తుందని లీక్‌ తప్ప ఇంకేమీ రాలేదు. దీంతో ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని అప్‌డేట్‌లు అడుగుతున్నారు.

ఫ్యాన్స్‌ కామెంట్లు చూసి ఊరుకునే రకం కాదు డీవీవీ సోషల్ మీడియా టీమ్‌. వారికి అదే స్థాయిలో రిప్లైలు కూడా ఇస్తుంటుంది. అఆ మరోసారి ఫ్యాన్స్‌కు డీవీవీకి మద్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. మీరేంట్రా వారానికి ఒకసారి ఇలా తగులుకున్నారు అంటూ డీవీవీ టీమ్‌ కౌంటర్లు వేసింది. అప్డేట్లు ఉన్నప్పుడు ఇస్తాను లేరా.. ఇప్పుడు మాత్రం ‘సీజ్ ది షిప్’ అంటూ సెటైర్ కూడా వేసింది. డిసెంబరు ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్‌ ఉంటుంది అని ప్రాథమిక సమాచారం. త్వరలోనే ఈ విషయం తేలుతుంది అని చెప్పాలి.

హాట్ టాపిక్ అయిన శోభిత సూసైడ్ నోట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus