రవితేజ కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో తెరకెక్కిన ఈగల్ మూవీ ఈ నెల 9వ తేదీన థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటివరకు 17 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. ఈ కలెక్షన్లు షేర్ కలెక్షన్లు కాగా ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. పీపుల్స్ మీడియా బ్యానర్ పై ఈ సినిమ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కు సంబంధించి షాకింగ్ అప్ డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీలలో ఒకటిన ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఇతర ఓటీటీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని భావించిన మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఈగల్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుందని తెలిసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రాలేదు.
ఒకింత ఆలస్యంగానే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈగల్ (Eagle ) సినిమాకు ఓటీటీలో ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. రవితేజ గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. మాస్ మహారాజ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. రవితేజ కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.
మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది మరో రెండు సినిమాలను రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు రవితేజ నిర్మాతగా పలు క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మిస్తూ అభిరుచిని చాటుకుంటున్నారు. మాస్ మహారాజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 25 నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. రవితేజ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!