EAGLE Release Trailer: ‘ఈగల్’ రిలీజ్ ట్రైలర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

మాస్ మహారాజ రవితేజ హీరోగా అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాఫర్ హీరోయిన్లుగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈగల్’. టీజర్ , పాటలు ఇదివరకే రిలీజ్ అవ్వడం.. వాటికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ‘ధమాకా’ తర్వాత ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో రవితేజ చేస్తున్న మూవీ ఇది. దీంతో ‘ఈగల్’ పై మంచి అంచనాలే ఉన్నాయి.మొదట జనవరి 13న ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు.

కానీ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలా ఈ సినిమా ఫిబ్రవరి 9 కి రిలీజ్ కాబోతుంది. జనవరిలో ఓ టీజర్ రిలీజ్ అయ్యింది. అందులో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనేది చూపించారు. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ ని కూడా వదిలారు. ఒక నిమిషం 30 సెకన్ల నిడివి కలిగిన ఈ రిలీజ్ ట్రైలర్లో కూడా కథని పెద్దగా రివీల్ చేయలేదు కానీ..

ఇది ఒక దళం కోసం జరిగే పోరాటం నేపథ్యంలో రూపొందిన సినిమా అని తెలుస్తుంది. నవదీప్,మధుబాల, ‘హనుమాన్’ విలన్ వినయ్ రాయ్ వంటి వారితో పాటు ప్రణీత పట్నాయక్ కూడా ఈ ట్రైలర్ లో కనిపించారు. వారు అత్యంత ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది.

కానీ మొదటి ట్రైలర్లో కనిపించిన హీరోయిన్లు ఇందులో కనిపించకపోవడం గమనించదగ్గ విషయం. ఇదిలా ఉండగా..’ఈగల్’ ఓ కొత్త పాయింట్ తో రూపొందిన ఓ స్టైలిష్ డ్రామా అని ఈ ట్రైలర్ తో చెప్పకనే చెప్పారు. టెక్నికల్ గా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని విజువల్స్ చెబుతున్నాయి. మీరు కూడా (Eagle) రిలీజ్ ట్రైలర్ ని ఓ లుక్కేయండి :

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus