Eagle Teaser: టైగర్ ని మరిపించేలా ఉందా..? లేదా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఈగల్. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రవితేజ చేస్తున్న సినిమా ఇది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫర్.. హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం నుండీ రవితేజ పాత్రను పరిచయం చేస్తూ టైటిల్‌ గ్లింప్స్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందన లభించింది. ఈరోజు టీజర్ ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

ఆ టీజర్ విషయానికి వస్తే… 1 నిమిషం 34 సెకన్ల పాటు నిడివి కలిగి ఉంది. ఎక్కువ శాతం యాక్షన్ సీన్స్ కి , హీరోయిజాన్ని ఎలివేట్ చేసే డైలాగ్లకి పెద్ద పీట వేశారు.వెలుతురు వెళ్లిన ప్ర‌తీ చోటా.. త‌న బుల్లెట్ వెళ్తుంది, జ‌నం దృష్టిలో క‌ట్టు క‌థ‌, ప్ర‌భుత్వాలు క‌ప్పెట్టేసిన క‌థ‌, లావాని వెన‌క్కి ర‌మ్మ‌ని పిల‌వ‌కు, ఊరూ ఉండ‌దు.. నీ ఉనికీ ఉండ‌దు వంటి డైలాగులు పవర్ ఫుల్ గా అనిపిస్తాయి.

రవితేజ రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఒక పాత్రలో నక్సలైట్ అన్నట్టు అతని లుక్ ఉంది.ఈగల్ 2024 సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజ కి సక్సెస్ ఇవ్వలేదు. మరి ఈ ఈగల్ అందిస్తుందేమో చూడాలి. టీజర్ ని (Eagle) మీరు కూడా ఒకసారి చూడండి:

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus