టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సినీ తారలపై కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేలా ఉన్నాయని.. కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేమని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ”సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చారు. దాని ఆధారంగా సిట్ బృందం పలువురు సినీ తారలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది.
అన్ని రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి విశ్లేషించింది. అయితే సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లభించలేదు. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చడానికి కేవలం కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం సరిపోదు” అని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఇప్పటికే పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లను ఎక్సైజ్ శాఖ పొందుపరచలేదు.
కెల్విన్ గురించి ఎక్సైజ్ శాఖ కొన్ని విషయాలను వెల్లడించింది. కెల్విన్ మంగుళూరులో చదువుకునేప్పటి నుంచి డ్రగ్స్ కి అలవాటు పడ్డాడని.. 2013 నుంచి తన స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడని.. గోవా, విదేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా కెల్విన్ డ్రగ్స్ తెప్పించాడని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
Most Recommended Video
‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?