Lyca Productions: లైకా ప్రోడక్షన్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ దాడులు.. ఏమైందంటే?

సినిమా నిర్మాతల మీద ఇన్‌కం ట్యాక్స్‌ దాడులు జరగడం కొత్తేం కాదు. అయితే ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ (ఈడీ) దాడులు జరుగుతున్నాయి. మొన్నీమధ్య టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌పై ఇలాగే దాడులు జరిగాయి. ఆ విషయంలో ఏం జరిగింది అనే విషయంలో తేలనే లేదు, అప్పుడే మరో పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌ మీద మంగళవారం దాడులు జరిగాయి. ఇక్కడ కూడా ఏం జరిగింది అనేది తెలియదు కానీ పెద్ద ఎత్తున దాడులు అయితే నిర్వహించారని చెన్నై వర్గాలు సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్‌ విషయంలో అన్ని కోట్లు, ఇన్ని కోట్లు అంటూ పెద్ద పెద్ద లెక్కలేశారు. ఇంత డబ్బు లెక్కలు దొరికాయి, అంత డబ్బులు లెక్కలు దొరకలేదు అంటూ చాలామంది చాలా రకాలుగా రాసుకొచ్చారు. దీంతో అసలు జరిగిందేంటి అనేది తెలియలేదు కానీ.. ఏదో జరిగింది అనే డౌట్‌ అయితే వచ్చింది. ఇప్పుడు మరో నిర్మాణ సంస్థ మీద ఈడీ దాడులు చేయడంతో ‘అసలు ఏం జరుగుతోంది’ అనే చర్చ మొదలైంది. ఇంతగా ఆర్థిక లావాదేవీల్లో తేడాలుంటున్నాయా అనే చర్చ కూడా మొదలైంది.

ఇంతకీ దాడులు జరిగిన నిర్మాణ సంస్థ (Lyca Productions) పేరు చెప్పలేదు కదా. ‘పీఎస్‌ 2’ లాంటి భారీ సినిమాను ఇటీవల తీసుకొచ్చిన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌. ఈ సంస్థ మీద దాడులు నిర్వహించారు. ఉదయం నుండి లైకా ఆఫీసులతో పాటు, వాళ్లకు సంబంధించిన ఇళ్లపై కూడా ఈడీ అధికారులు దాడులు చేశారు. అయితే ఇందులో ఏం తెలిసింది అనే విషయం మాత్రం చెప్పలేదు. త్వరలో అధికారికంగా చెబుతారు అనే చర్చ నడుస్తోంది.

లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’, రజనీకాంత్ అతిథి పాత్రలో ‘లాల్ సలామ్’ లాంటి చిత్రాల్ని నిర్మిస్తోంది. ఇవి కాకుండా మరో రెండు పెద్ద సినిమాలున్నాయి. దీంతో ఇంత పెద్ద సంస్థ మీద ఉన్నపళంగా ఈడీ ఎందుకు వచ్చింది అనేది తెలియాల్సి ఉంది. విదేశీ పెట్టుబడుల కోణం, అక్రమ పెట్టుబడుల కోణం ఏమైనా ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus