Shankar: ED టార్గెట్‌లో శంకర్.. 11 కోట్లు ఎందుకు అటాచ్ చేశారంటే?

టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శంకర్ (Shankar) ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ రోబో (ఏంథిరన్)పై జరిగిన కథా కాపీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆరూర్ తమిళనాథన్ అనే రచయిత 2011లో ఈ సినిమా తన కథ ఆధారంగా తీసుకున్నదని కోర్టులో పిటిషన్ వేయగా, అది ఇప్పుడు శంకర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

Shankar

తాజా సమాచారం ప్రకారం, ఈ కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ప్రారంభించి, శంకర్‌కు (Shankar) సంబంధించిన 11.50 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ప్రధానంగా చెన్నైలో ఉన్న మూడు స్థిరాస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద సీజ్ చేశారు. రోబో సినిమాకు స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ చేసినందుకు శంకర్‌కు 11.50 కోట్ల మొత్తం పారితోషికంగా వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

ఇక శంకర్ (Shankar) కథ విషయంలో కాపీకి పాల్పడ్డారనే ఆరోపణను బలపరిచేలా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) కూడా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. జిగూబా అనే కథ, రోబో స్క్రిప్ట్‌లో చాలా పోలికలు ఉన్నాయని ఆరూర్ తమిళనాథన్ అప్పట్లో కోర్టులో ప్రదర్శించారు. ఆ ఆధారాలతోనే ఇప్పుడు ED ఆస్తులపై చర్యలు తీసుకుందని చెబుతున్నారు.

ఇదే సమయంలో శంకర్ (Shankar) కెరీర్ కూడా కష్ట కాలంలో ఉంది. ఇటీవల విడుదలైన ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు నిరాశపరిచాయి. ఒకవైపు సినిమా పరాజయాలు, మరోవైపు పాత కేసు ఇలా తిరిగి తెరపైకి రావడం శంకర్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఆయన ప్రస్తుతం వేల్పరి అనే హిస్టారికల్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ కేసుపై ఇప్పటివరకు శంకర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వివాదం మరింత సాగుతుందా, లేక చక్కబడుతుందా అనేది చూడాలి.

 

‘డాకు మహారాజ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus