Pushpa 2: ‘పుష్ప 2’ సినిమా టీమ్‌ నుండి హార్డ్‌ న్యూస్‌.. ఏమైంది? ఎవరు వెళ్లిపోయారు?

‘పుష్ప’ (Pushpa) సినిమా టీమ్‌ ప్రామిస్‌ చేసిన రిలీజ్‌ డేట్‌కి ఇంకా గట్టిగా మూడు నెలలు ఉంది. ఇప్పటికే సినిమా చెప్పిన సమయానికి వస్తుందా? రాదా? అనే చర్చ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఎందుకంటే దర్శకుడు సుకుమార్‌ (Sukumar) రిలీజ్‌ డేట్‌ దగ్గరికొచ్చినా చెక్కుతూనే ఉంటారు అనే విషయం గుర్తు చేసుకున్నారు జనాలు. ఇలాంటి సమయంలో సినిమాకు అత్యంత కీలకమైన టెక్నీషియన్‌ సినిమా నుండి తప్పుకున్నారు అనే వార్త వస్తోంది.

దర్శకుడు తీసుకొచ్చిన ఫుటేజ్‌ను ఒక ఆర్డర్‌లో, ఆకర్షణీయంగా గుదిగుచ్చి అందించే ఆ కీలకమైన టెక్నీషియనే ఎడిటల్‌. 2021లో రిలీజైన ‘పుష్ప’ విజయంలో ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ఒక కారణం. ఇప్పుడు ఆయనే ఈ సినిమా నుండి వైదొలిగినట్లు తెలుస్తోంది. అనుకున్న సమయం కన్నా ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) లేటు అవుతూ రావడడంతో తప్పనిసరి పరిస్దితుల్లో ఆంటోనీ రూబెన్‌ సినిమా నుండి తప్పుకున్నారు అని చెబుతున్నారు. ఇప్పటికే ఓకే చేసిన సినిమాల వల్లే ఈ మార్పు అంటున్నారు.

‘బిగిల్’ (Bigil) , ‘మెర్సల్’ (Mersal) , ‘వివేగం’, ‘పుష్ప’, ‘జవాన్’ (Jawan) లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలను ఎడిటింగ్ చేయడంలో ఆంటోనీ రూబెన్ పేరు గాంచారు. అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న వరుణ్ ధావన్ ‘బేబీ జాన్‌’ సినిమాతో రూబెన్‌ బిజీగా ఉన్నారట. దీంతో ‘పుష్ప: ది రూల్‌’ నుండి తప్పుకున్నారు అని అంటున్నారు. దీంతో ఇప్పుడు సుకుమార్ – అల్లు అర్జున్ టీమ్ మరో స్టార్‌ ఎడిటర్‌ కోసం ఆలోచనలు చేసిందట.

ఈ క్రమంలో జాతీయ అవార్డు ఎడిటర్‌ నవీన్ నూలితో చర్చలు ప్రారంభించారు. నవీన్ నూలి గతంలో సుకుమార్‌ ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho) , ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమాలకు పని చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనతో ఈ సినిమా పనులు చేయించాలని చూస్తున్నారట. మరి ఆయన ఏమంటారో చూడాలి. ఈ ఎంపిక విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా.. సినిమా విడుదల తేదీ విషయంలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది అని చెప్పొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus