Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్‌రాజ్‌, త్రిగుణ్‌, హెబ్బా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఈషా'(Eesha).బబ్లూ పృథ్వీరాజ్‌ వంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌’ బ్యానర్ పై నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Eesha First Review

శ్రీనివాస్‌ మన్నె ఈ చిత్రానికి దర్శకులు. ‘వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్’, ‘బన్నీ వాస్ వర్క్స్’ సంస్థల పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ‘లిటిల్ హార్ట్స్’ ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి సినిమాలు ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయ్యాయి. అందుకే బన్నీ వాస్, వంశీ నందిపాటి..ల పై నమ్మకంతో ఈ సినిమాని చూడాలనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది.

ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సన్నిహితులకు బన్నీ వాస్, వంశీ నందిపాటి..లు చూపించడం జరిగింది. సినిమా చూశాక ‘ఈషా’ పై తమ అభిప్రాయాన్ని వారు పంచుకున్నారు.వారి టాక్ ప్రకారం.. ‘ఈషా’ మొదటి సీన్ నుండే భయపెడుతుందని అంటున్నారు. కథ మొదటి 15 నిమిషాలు అర్ధం చేసుకోవడానికి టైం పడుతుందట. 15 నిమిషాల తర్వాత అందరూ అటెన్షన్ మోడ్ కి వచ్చేసాతారట.

ప్రతి 10 నిమిషాలకి ఒక హర్రర్ ఎలిమెంట్ అందరినీ భయపెడుతుందట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే దెయ్యాలు పక్కనే కూర్చున్న ఫీలింగ్ ఇస్తాయట. సినిమాటోగ్రఫీ అయితే దెయ్యం మన వెనకాలే ఉంది అనే ఫీలింగ్ ఇస్తుందని చెబుతున్నారు. క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు అయితే ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం కూడా అందరినీ మెప్పిస్తుంది అంటున్నారు.

ఓవరాల్ గా ఇది రెగ్యులర్ హర్రర్ సినిమాలా ఉండదని.. కచ్చితంగా కొత్త ఫీలింగ్ కలిస్తుందని అంటున్నారు. మరి ప్రీమియర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus