Mohanlal: చిరంజీవి – బాబీ సినిమాలో మలయాళ అగ్ర హీరో… తమిళ హీరోను కాదనుకొని…

ఇంతకుముందు ఓసారి మనం చెప్పుకున్న మాటే.. కొన్ని పుకార్లు వినడానికి బాగుంటాయి, నిజమైతే బాగుంటుంది అనిపిస్తాయి కానీ కచ్చితంగా అందులోని విషయం జరుగుతుంది అని చెప్పలేం. అలాంటి ఓ పుకారు ఇప్పుడు టాలీవుడ్‌లో, తెలుగు సినిమాకు సంబంధించిన సర్కిళ్లలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. అదే చిరంజీవి సినిమాలో ఓ మలయాళ సూపర్‌ స్టార్‌ నటిస్తున్నారు అని. వినడానికి, జరగడానికి చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్న ఈ అంశం గురించి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని అంటున్నారు.

Mohanlal

ప్రస్తుతం చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే కృతనిశ్చయంతో సినిమా టీమ్‌ పని చేస్తోంది. ఇక ఈ సినిమా వచ్చాక చిరంజీవి గ్యాప్‌ లేకుండా కేఎస్‌ రవీంద్ర (బాబీ) సినిమాను స్టార్ట్‌ చేసేస్తారట. ఓ షెడ్యూల్‌ అయ్యాక ‘విశ్వంభర’ సినిమా పనులు చూస్తారని భోగట్టా. ఆ విషయం పక్కనపెడితే బాబీ సినిమా కాస్టింగ్‌ పనులు ఓ కొలిక్కి వచ్చాయని అంటున్నారు. అందలో భాగంగానే మోహన్‌లాల్‌ మేటర్‌ బయటకు వచ్చింది.

‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత చిరు – బాబీ మరోసారి కలసి సినిమా చేస్తున్నారు. అందులో ఓ ముఖ్యపాత్రకు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ను అడిగారట. నిజానికి ఈ పాత్రకు తొలుత ఓ తమిళ యువ హీరోను సంప్రదించారని టాక్‌. అయితే పాత్ర ప్రకారం ఆ పాత్ర వయసు ఎక్కువగా ఉండటంతో ఆలోచన మార్చుకున్నారని సమాచారం. అందుకే మోహన్‌లాల్‌ అయితే కరెక్ట్‌గా ఉంటుందని అనుకుంటున్నారట. ఇలాంటి పాత్రలు లాలెటన్‌ చేస్తుంటారు కాబట్టి చిరు సినిమాను కూడా ఓకే చేయొచ్చు అని అంటున్నారు.

ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌లో గాడ్‌ఫాదర్‌ vs లూసిఫర్‌ కానీ.. గాడ్‌ఫాదర్‌ with లూసిఫర్‌ కానీ అవుతుంది. ఈ సినిమా ఓపెనింగ్‌ రోజు మరిన్ని వివరాలు వస్తాయి. ఈ సినిమాను కన్నడ సీమకు చెందిన కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అప్పుడు యాస నప్పలేదు.. ఇప్పుడు జాగ్రత్తపడతారా? లేకపోతే రిస్క్‌ చేస్తున్నట్లే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus