ఇండస్ట్రీలో నన్ను ఇప్పుడిప్పుడే గుర్తుపడుతున్నారు

ఇటీవలే అరవింద సమేత వీర రాఘవలో నటించి పేరు తెచ్చుకుంది ఈషా రెబ్బ. ఈ చిత్రంతో ఈషా మరో స్థాయి సినిమా చేసినట్లయింది. ఇది తన ప్రతిభకు తగిన గుర్తింపుగా చెప్పుకుందీ సుందరి. ఈ గుర్తింపు ఇకపై కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సుమంత్‌ సరసన సినిమా చేస్తున్న ఈషా…జయాపజయాల విషయంలో చాలా ఆలోచిస్తానంది. తాను నటించిన సినిమా విడుదలవుతుందంటే ముందు రోజు రాత్రి నిద్రే పట్టదని చెప్పుకుంది. రాబోయే ఫలితం గురించి అంతలా మథనపడతానని అంటోంది. సినిమా ఎంపికలో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వనని చెప్పుకుంది ఈషా.

సినిమా రిజల్ట్స్ నన్ను చాలా ప్రభావితం చేస్తాయి. చేసిన సినిమా జనాదరణ పొందాలనే నటీనటులంతా కోరుకుంటారు. నేనూ అంతే. ఒక సినిమా తెరపైకి వస్తుందంటే ఆ ముందు రోజు రాత్రి నిద్రే పట్టదు. నా మొదటి సినిమా ఆడనప్పుడు బాధపడినా, మరో సినిమా చిత్రీకరణలో ఉండి మర్చిపోయాను. అలా పనిలోనే బాధను మర్చిపోతుంటాను. పరిశ్రమలో నాకిప్పుడే గుర్తింపు మొదలైంది. పెద్ద దర్శకులు నా ప్రతిభను చూస్తున్నారు. త్వరలో మరిన్ని మంచి చిత్రాలు చేస్తాననుకుంటున్నాను. నా వరకు మంచి సినిమాకే ప్రాధాన్యత ఇస్తాను. డబ్బు గురించి పట్టుబట్టను. పరిశ్రమకు నాకు కొంత ఇచ్చింది దానికే కృతజ్ఞతగా ఉంటాను అంటోంది ఈషా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus