అరవింద సమేత వీర రాఘవ సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్న ఈషా రెబ్బ

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ అమీ తుమీ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా వచ్చిన “అ” సినిమాలోను తన నటనతో ఆశ్చర్యపరిచి మంచి ఆఫర్లు పట్టేసింది. ప్రస్తుతం అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హైదరాబాద్ అమ్మాయిగా కనిపించనుంది. రీసెంట్ తన షూటింగ్ ని కంప్లీట్ చేసిన ఈ భామ డబ్బింగ్ పనులు మొదలు పెట్టింది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో రూపంలో వెల్లడించింది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11 న తప్పకుండా రిలీజ్ కావాలని పగలు, రాత్రి అని తేడా లేకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్ర బృందాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

ఒకే సమయంలో ప్రొడక్షన్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేపడుతున్నారు. ఎడిటింగుతో పాటు డబ్బింగ్ ను కూడా చకచకా పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా ఇందులో కీలక రోల్ పోషించిన బ్రహ్మాజీ డబ్బింగ్ పూర్తి చేశారు. ఈషా రెబ్బా రెండు రోజుల్లో డబ్బింగ్ కంప్లీట్ చేయనుంది. ఎస్ థమన్ స్వరపచిన పాటలను వేడుక లేకుండా ఈరోజు నేరుగా మార్కెట్లోకి విడుదల చేసారు. ఇదివరకే వచ్చిన అనగనగా, పెనిమిటి పాటలతో పాటు మిగిలినవి కూడా ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus