ఆసక్తికర విషయాలు చెప్పిన ఈషా రెబ్బ

టాలీవుడ్ లో మళ్లీ తెలుగు హీరోయిన్స్ హవా రాబోతోంది. పరభాషా నటీమణులకు తామేమి తక్కువకాదని తెలుగు అమ్మాయిలు నిరూపిస్తున్నారు. అటువంటి వారిలో ఈషా రెబ్బ ముందుంది. “అంతకుముందు ఆ తరువాత” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె “అమీతుమీ”తో మంచి నటిగా పేరుతెచ్చుకుంది. అలాగే “అ” మూవీలో విభిన్నమైన పాత్రలో మెప్పించింది. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీర రాఘవ”లో ఈషా రెండో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కెరీర్ లో ఇదే పెద్ద సినిమా. స్టార్ హీరో పక్కన నటిస్తుండడంతో అందుకు తగ్గట్టు మారిపోయింది. అభినయంలోనే కాదు, అందంలోను అదరగొడుతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. ”మాది చాలా పెద్ద కుటుంబం.

సెలవురోజుల్లో కుటుంబ సభ్యులంతా కలిసి జట్టుగా రిసార్ట్స్‌ వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటాం. గెట్‌ టు గెదర్‌ టైంలో కుటుంబ సభ్యులంతా సెల్‌ఫోన్లు పక్కన పడేయాల్సిందే. ఫోన్‌ చేతితో ఉందంటే చాలు పక్కన ఉన్నవాళ్లను పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందుకే కండీషన్‌ పెట్టుకొని మరీ కుటుంబసభ్యులమంతా బయటకు వెళ్తుంటాం. నా చిన్నప్పుడు అశోక్‌నగర్‌లోని శ్రీనివాస్‌ థియేటర్‌లో అమ్మ, నాన్నలతో కలసి సినిమాలు చూసేవాళ్లం. థియేటర్‌ ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉంది. థియేటర్‌ వద్ద ఉండే సందండంతా మా ఇంట్లో కనిపించేది. ఇప్పుడా ఆ సినిమా థియేటర్‌ లేదనుకోండి” అని ఈషా ఆనాటి సంగతులను గుర్తుకు తెచ్చుకుంది. అరవింద సమేత తర్వాత ఈషా రెబ్బ మరిన్ని పెద్ద చిత్రాల్లో స్థానం సంపాదించుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus