నెటిజన్ కి అవాక్కయ్యే ప్రశ్న వేసిన తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా

తెలుగు చిత్ర పరిశ్రమలో పరభాషా భామలతో పోటీ పడుతోన్న నటి ఈషా రెబ్బా. అమీ తుమీ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఈమె “అ” సినిమాలోను తన నటనతో ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత వీర రాఘవలో చిన్నరోల్ అయినప్పటికీ.. తన పాత్రకు న్యాయం చేసి అభినందనలు అందుకుంది. “ఏమైనా తెలుగు అమ్మాయి కళ వేరు.. మాట్లాడిన మాటలు వింటుంటే అదొక ఆనందం..మా తారక్ గారితో మీరు మళ్ళీ కలసి నటించాలని ఆశిస్తున్నాను. తెలుగు ఇండస్ట్రీలో టాప్ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను” అనే ప్రసంశలు మాత్రమే కాదు.. విమర్శలు కూడా ఎదురయ్యాయి. వాటిని తనదైన స్టైల్లో తిప్పికొట్టింది.

ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. అసలు విమర్శ.. సమాధానం ఏమిటంటే.. “ఈషా గారు మీరు కొంచెం కలర్ ఎక్కువగా ఉంటే మీకు తిరుగుండేది కాదు” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అందుకు ఈషా ఇలా స్పందించింది. “ఎందుకు ఆ కలర్ పిచ్చి. నాకు ఉన్న కలర్ తోనే నేను సంతోషంగా ఉన్నాను. హీరోలు ఎలా ఉన్న ఫర్వాలేదు. కానీ హీరోయిన్ మాత్రం తెల్లగా, మన నేటివిటీకి సంబంధం లేకుండా ఉంటే మీకు ఇష్టమా?” అంటూ ప్రశ్నించింది. ఆమె చెప్పిన మాటల్లో నిజముందని మద్దతు పలుకుతున్నారు. అరవింద తర్వాత ఆమె నటించిన “సుబ్రమణ్యపురం” త్వరలోనే రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus