హారర్ చిత్రంతో రాబోతున్న ఈషా రెబ్బా..!

గత కొంత కాలంగా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈషా రెబ్బ. చూడటానికి చాలా చక్కగా ఉంటూ.. సహజమైన నటనతో.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉండే ఈ భామ… తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుంటూ దర్శకనిర్మాతల్ని ని ఆకర్షిస్తుంది. అయితే ఈ బేబీ కి పెద్ద సినిమాల అవకాశాలు మాత్రం రావడం లేదు. చేసిన సినిమాలు కూడా తక్కువే అయినా ఈ అమ్మడి క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. గత సంవత్సరం ‘అరవింద సమెత’ లో అవకాశం వచ్చినా పెద్దగా ఉపయోగం లేదు. దీంతో కథా బలం ఉన్న చిత్రాల్ని ఎంచుకుని ముఖ్యంగా తన పాత్రకి ప్రాధాన్యత ఉండే పాత్రల్నే చేయాలని డిసైడ్ అయ్యిందట.

ఇందులో భాగంగా… ఓ హారర్ చిత్రం చేయడానికి రెడీ అయ్యిందట. కింగ్ నాగార్జునతో ‘డమరుకం’ వంటి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి చాలా ఏళ్ళ తరువాత ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. హారర్ అండ్ సస్పెన్స్ కథాంశంతో శ్రీనివాస్ ఈ చిత్రాన్ని రూపొందనుందట. ఈ చిత్రంలో ఈషా రెబ్బ సెలెక్ట్ ప్రధాన పాత్ర చేయబోతుందట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. మరి ఈ చిత్రంతో అయినా ఈ అమ్మడు పెద్ద అవకాశాలు దక్కించుకుంటుందేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus