ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా ? బలమైన కారణం ఏంటో తెలుసా..!

బిగ్ బాస్ హౌస్ లో గతవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది. హమీదా ఎలిమినేట్ అయ్యింది. అయితే, ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం అత్యంత నాటకీయంగా ఉండబోతోంది. ఈవారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టి తీరాల్సిందే. ఎందుకంటే, మిగిలింది రెండు వారాలే కాబట్టి, ఈవారం డబుల్ ఎలిమినేషన్ చేస్తేనే వచ్చే వారం టాప్ – 5 , లేదా టాప్ – 6 కంటెస్టెంట్స్ ఫినాలేకి అర్హతని సాధిస్తారు. బాబాభాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల హౌస్ లో స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వాల్సి వస్తోంది. అయితే, ఈవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. డేంజర్ జోన్ లో ముగ్గురు ఉన్నారు. అషూరెడ్డి, అనిల్ రాథోడ్, ఇంకా అరియానాలు ఉన్నారు. అయితే, వీరిలో ఎవరు వెళ్లిపోబోతున్నారంటే చాలామంది అషూరెడ్డికే ఓటు వేస్తున్నారు. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ప్రకారం అషూరెడ్డి లీస్ట్ లో ఉంది. దీన్ని బట్టీ చూస్తే ఈవారం అషూరెడ్డి ఇంటి నుంచీ వెళ్లిపోబోతోందనే అనిపిస్తోంది.

ప్రస్తుతం అషూరెడ్డి నామినేషన్స్ లో ఉన్నవారికంటే కూడా బలంగా కనిపించడం లేదు. గేమ్ పరంగా కూడా ఈవారం పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అయితే, ఎలాగైనా సరే టాప్ 5కి అషూరెడ్డి వెళ్తుందా ? కావాలని బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా అనేది మాత్రం ఆసక్తికరం. ప్రస్తుతం అషూరెడ్డి అయితే డేంజర్ జోన్ లోనే కనిపిస్తోంది. చాలా తక్కువ పర్సెంట్ ఓటింగ్ ని కైవసం చేసుకుంది అషూ. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం హౌస్ మేట్స్ పోటీపడుతున్న టాస్క్ లో కూడా అషూ పెర్ఫామన్స్ ఏమీ ఇంప్రెసివ్ గా కనిపించడం లేదు. అలాగే, ఈసారి నామినేషన్స్ లో అఖిల్, బిందు మాధవి కూడా ఉండటం అనేది అషూకి మైనస్ అయ్యింది. వీరిద్దరి మద్యలోనే గట్టి పోటీ అనేది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఈసారి విన్నింగ్ రేస్ లో బిందు మాధవి అఖిల్ తో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో అషూకి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది తగ్గుతోంది.

నామినేషన్స్ లో బలమైన ప్రత్యర్ధులు ఉండటం, ఈవారం గేమ్ అనేది బెడిసికొట్టడం అనేది అషూరెడ్డిని ఎలిమినేట్ చేస్తుందా అని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే, రేస్ లో అరియానా, అనిల్ ఇద్దరూ కూడా అషూకి గట్టిపోటీ ఇస్తున్నారు. నిజానికి హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ స్టేజ్ పైకి వచ్చినపుడు అషూని టాప్ – 5లో చూడాలని ఒక్కరు కూడా అనుకోలేదు. అషూ పేరు అస్సలు చెప్పలేదు. దీన్ని బట్టీ అషూకి కూడా ఇప్పుడు ఎలిమినేట్ అవుతాననే భయం పట్టుకుంది. మరి ఈవారం అషూరెడ్డి ఎలిమినేట్ అయితే, ఫిమిల్ కంటెస్టెంట్ రేస్ లో మిత్రా, బిందు, అరియానాలు మాత్రమే మిగులుతారు. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus