టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో సుశాంత్ (కార్తీక్) లేడనే వార్త ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. తరుణ్ భాస్కర్ తన పోస్ట్‌లో సుశాంత్ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడని క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఆ పాత్రను వేరొకరితో రీప్లేస్ చేయడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ ఐకానిక్ క్యారెక్టర్‌కు న్యాయం చేసే సత్తా ఎవరికుంది? తరుణ్ భాస్కర్ మైండ్‌లో ఉన్న ప్లాన్ ఏంటి?
నిజానికి ‘ఈ నగరానికి ఏమైంది’ గ్యాంగ్‌లో కార్తీక్ పాత్ర చాలా ప్రత్యేకం. గ్యాంగ్‌లో అందరూ ఒకెత్తు అయితే, తన అమాయకత్వంతో నవ్వులు పూయించే కార్తీక్ మరో ఎత్తు. ముఖ్యంగా ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ధర చెప్పినప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్, వివేక్‌తో సాగే సీరియస్ కన్వర్సేషన్స్‌లో కార్తీక్ చూపించే ఎమోషన్స్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. సుశాంత్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని చెప్పాలి. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి కొత్త నటుడిని తీసుకురావడం అంటే, అతను కేవలం యాక్టింగ్ చేస్తే సరిపోదు, ఆడియన్స్‌తో అదే లెవల్ బాండింగ్‌ను క్రియేట్ చేయాలి.
తరుణ్ భాస్కర్ తన పోస్ట్‌లో “ఈ పాత్రలు నా చుట్టూ ఉన్న మనుషుల నుండి పుట్టాయి” అని రాసుకొచ్చారు. అంటే స్క్రిప్ట్ పరంగా కార్తీక్ పాత్రలో ఉన్న సోల్‌ను తరుణ్ అస్సలు మార్చడం లేదు. సుశాంత్ లేకపోయినా కార్తీక్ ఉంటాడంటే, ఆ పాత్ర మేనరిజమ్స్ ఆటిట్యూడ్ పాత కార్తీక్‌లాగే ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. సుశాంత్‌ను పోలిన లుక్స్ ఉన్న వారికంటే, ఆ పాత్రలోని ఫ్రస్ట్రేషన్ అండ్ కామెడీని పండించే కొత్త టాలెంట్‌ను తరుణ్ వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. తరుణ్ భాస్కర్ ఎప్పుడూ తన సినిమాల్లో కొత్త నటుల నుండి బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టుకుంటారు. ENE పార్ట్ 1 సమయంలో కూడా అప్పుడు అందరూ కొత్తవారే, కానీ ఇప్పుడు వారంతా స్టార్స్ అయ్యారు. కాబట్టి ఈ సీక్వెల్‌లో కార్తీక్ పాత్ర కోసం తరుణ్ ఎంచుకునే నటుడు కచ్చితంగా ఆశ్చర్యపరిచేలా ఉంటాడనడంలో సందేహం లేదు. ఆడియన్స్ పాత కార్తీక్‌ను మర్చిపోయేలా చేయకపోయినా, కొత్త కార్తీక్‌ను ఓన్ చేసుకునేలా చేయడంపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవని, “ద బాయ్స్ విల్ బి బ్యాక్” అని తరుణ్ ధీమాగా చెబుతున్నారంటే, ఆయన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉందని అర్థం. మరి సుశాంత్ లేని లోటును తరుణ్ తన మేకింగ్ మ్యాజిక్‌తో ఎలా భర్తీ చేస్తాడో చూడాలి.