Suriya: తెలుగులో మంచి మార్కెట్ పెట్టుకొని కూడా తెలుగు టైటిల్ ను పక్కనెట్టారా

ఈమధ్యకాలంలో కొన్ని తమిళ, మలయాళ సినిమాలు కనీసం టైటిల్ మార్చకుండా తమ ఒరిజినల్ టైటిల్ తోనే తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఈ విషయమై ఆల్రెడీ చాలా రచ్చ జరిగింది. అజిత్ “వలిమై”, రజనీకాంత్ “వెట్టయన్”, మోహన్ లాల్ “తుడరమ్” సినిమాలను అదే టైటిల్ తో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో టైటిల్ అర్థం కాక చాలామంది ఆ సినిమాలకు వెళ్లలేదు. ఆడియన్స్ కు టైటిల్ అర్థమవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఒక చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేస్తున్నప్పుడు ఆ సినిమాకి కనీసం ఆ భాషకు సంబంధించిన టైటిల్ పెట్టడం అనేది ఆ భాషకు, మార్కెట్ కు ఇచ్చే కనీస మర్యాద.

Suriya

తమిళంతో సమానమైన మార్కెట్ ను తెలుగులోనూ కలిగిన సూర్య ఇలా చేయడం అనేది బాధాకరం. అతడి మునుపటి చిత్రం “కంగువా” కూడా అన్నీ భాషల్లో ఒకే టైటిల్ తో రిలీజైనా అదేదో పేరులే అనుకున్నాం. కానీ.. ఈరోజున సూర్య తాజా చిత్రం “కరుప్పు”ను తెలుగులోనూ అదే టైటిల్ తో విడుదల చేయడం అనేది చర్చనీయాంశం అయ్యింది. మరీ ఇంత కేర్ లెస్ గా తీసుకున్నారా మన తెలుగు మార్కెట్ ను అనే బాధ.

అది కూడా సూర్య లాంటి నటుడు ఇలా చేయడం అనేది ఇంకాస్త ఎక్కువ బాధపెట్టిన అంశం. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే గనుక ఇకపై మిగతా సినిమాలు కూడా తెలుగు టైటిల్ అనేది పట్టించుకోకుండా తమ ఒరిజినల్ టైటిల్ తోనే తెలుగులోనూ రిలీజ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక అప్పుడు తెలుగు ప్రేక్షకులందరూ నడుం బిగించి తెలుగు డబ్బింగ్ సినిమాకి తెలుగు టైటిల్ పెడితే తప్ప థియేటర్లలో సినిమా చూడం అని సిగ్నల్ ఇస్తే తప్ప మేకర్స్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం లేదు.

అప్పుడు యాక్టింగ్‌ ఆపేద్దాం అనుకున్నా: రెజీనా షాకింగ్‌ కామెంట్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus