హీరోయిన్ ప్రణీత … తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలే. ‘ఏం పిల్లో … పిల్లడో’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత… అటు తర్వాత ‘బావ’ ‘అత్తారింటికి దారేది’ ‘రభస’ ‘బ్రహ్మోత్సవం’ ‘డైనమైట్’ ‘ హలో గురు ప్రేమ కోసమే’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈమె కెరీర్ చిన్న సినిమాలతో మొదలుపెట్టినప్పుడు పర్వాలేదు అనిపించుకున్నా తరువాత పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చెయ్యడం వల్లే ఈమెకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు.
ప్రస్తుతం ఈమెకు ఎక్కువగా అవకాశాలు లేవు. కానీ ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కంటే గ్రేట్ అనిపించుకుంటుంది. అదెలా అనేగా మీ డౌట్. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల పేద సినీ కళాకారులకు పూట గడవని పరిస్ధితి నెలకొంది. ఇందుకు సి.సి.సి(కరోనా క్రైసిస్ ఛారిటీ) ని స్థాపించిన మెగాస్టార్ .. ఈ సంస్థ ద్వారా ఎంతో హీరోలు తమకు తోచిన విరాళాలు అందిస్తున్నారు. అయితే హీరోయిన్లు మాత్రం ముందుకు రాలేదు.అటువంటి నేపధ్యంలో.. పేద సినీ కార్మికులను ఆదుకోవడానికి మొదటిగా ముందుకు వచ్చిన హీరోయిన్ ప్రణీతనే. ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయలను అందించి వారిని ఆదుకుంది.
అంతేకాదు స్వయంగా ఆమెనే వంట చేసి ఇప్పటి వరకూ 75 వేల మంది ఆకలి తీర్చింది. మిగిలిన హీరోయిన్లు పిల్లో ఛాలెంజ్ లు అంటూ టైం పాస్ చేస్తుంటే … పాపం ఎక్కువ ఆఫర్లు కూడా లేని ప్రణీత మాత్రం మిగిలిన వారి ఆకలి తీర్చడమే పనిగా పెట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.