టీజర్ రిలీజ్ కి అంతా సిద్ధం చేసిన అరవింద సమేత చిత్ర బృందం

స్టార్ హీరోలతో సినిమా అంటే అంత ఈజీ కాదు. పైగా మాస్, క్లాస్ అని తేడా లేకుండా ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు. సినిమాని బాగా తీయడమే కాదు.. దానిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా చిత్ర బృందానికి కష్టమే. ఆ విషయం అరవింద సమేత వీర రాఘవ చిత్ర యూనిట్ సభ్యులకు బాగా అర్థమయి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ షూటింగ్ ఫొటోస్ మాత్రమే కాదు.. టీజర్ కూడా లీక్ అయి తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ సినిమాపై క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసివచ్చేలా చేసింది. అందుకే టీజర్ వర్క్ ని డైరక్టర్ చెన్నై కి తరలించారు. అక్కడే అన్ని పనులు పూర్తి చేశారు. తాజాగా మ్యూజిక్ డైరక్టర్ ఎస్ ఎస్ థమన్ టీజర్ కి నేపథ్యసంగీతాన్ని సమకూర్చారు.

ఆ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించారు. “టీజర్, బీజీఎమ్ లాక్ అయింది. తారక్ అన్న సినిమా కోసం నేను ఇవ్వాలనుకున్న సంగీతాన్ని ఇచ్చాను. ఈ టీజర్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 15 న రిలీజ్ కానుంది. అభిమానులందరూ రెడీగా ఉండండి” అంటూ ట్వీట్ చేశారు. అలాగే అతను పోస్ట్ చేసిన ఫోటో ప్రకారం టీజర్ 1 .04 నిముషాల నిడివి ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. లీక్ కారణంగా టీజర్ రిలీజ్ వాయిదా వేస్తారనే అనుమానం వీడింది. హంగామాకి సిద్ధమయిపోయారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus