ఇప్పటికీ లావణ్య రాక్షసిలానే కొనసాగుతుందట..!

‘అందాల రాక్షసి’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది లావణ్య త్రిపాఠి. ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా… లావణ్య నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. తరువాత ‘దూసుకెళ్తా’ ‘మనం’ వంటి చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అటు తరువాత వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి చిత్రాలతో వరుస విజయాల్ని అందుకుంది. ఇక లావణ్య టాప్ హీరోయిన్ అయిపొయింది అని అంతా అనుకున్నారు కానీ… వెంటనే ‘మిస్టర్’ ‘యుద్ధం శరణం’ ‘ఇంటిలిజెంట్’ ‘అంతరిక్షం’ వంటి చిత్రాలు లావణ్యాని కోలుకోలేని దెబ్బ తీశాయి.

ఇక నిఖిల్ హీరోగా వస్తున్న ‘అర్జున్ సురవరం’ .. చిత్రం పైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం మార్చి 29 న విడుదల కావాల్సినప్పటికీ కొన్ని కారణాల వల్ల మే 1 కి మారింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది లావణ్య త్రిపాఠి. ఈ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన సంగతుల్ని తెలియజేసింది. లావణ్య మాట్లాడుతూ .. ” ‘అందాల రాక్షసి’ నా మొదటి సినిమా కావడం నేను చేసుకున్న అదృష్టం. ఈ చిత్రంతో నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎక్కడికి వెళ్ళినా ‘అందాల రాక్షసి’ అనే పిలుస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక ‘అర్జున్ సురవరం’ చిత్రంలో నేను హీరోతో పాటూ ఒక రిపోర్టర్ గా కనిపిస్తాను. చాలా రోజుల తరువాత ఒక డిఫరెంట్ రోల్ చేశాననిపించింది. ఈ పాత్ర ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం నాకుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus