అమలపాల్ నటనను, కాన్సెప్ట్ కు మంచి ఆదరణ

రిలీజ్ ఆపేయాలని మహిళా సంఘాల గోల, రిలీజ్ అవ్వనివ్వమని కొందరు సంఘ సంస్కర్తల హడావుడి, కమర్షియల్ ఇష్యూస్ వల్ల అసలు శుక్రవారం రిలీజ్ కూడా అవ్వలేదు. ఇక శనివారం విడుదలవ్వడంతో జనాలు థియేటర్లో చూడడానికి పెద్దగా ఆసక్తి కూడా చూపలేదు. కానీ.. తమిళంలో వచ్చిన రిపోర్ట్ ను బట్టి కొందరు తెలుగులో చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. అదే “ఆమె” చిత్రం. అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గతవారం విడుదలై ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తోంది.

అమలపాల్ నగ్నంగా నటించింది కదా.. ఏదో చూసేద్దాం అని థియేటర్ కి వెళ్లకుండా.. సినిమా కాన్సెప్ట్ ను చూసి వెళ్తే మాత్రం తప్పకుండా “ఆమె” మిమ్మల్ని మెప్పిస్తుంది. ముఖ్యంగా ఫెమినిజం అనే అంశాన్ని అత్యంత నిజాయితీగా చర్చించిన తీరు, ఆ ఫెమినిజంతో కొందరు ఆడాళ్ళు తమ స్వతంత్రాన్ని ఎలా దుర్వినియోగపరుచుకొంటున్నారు అని వివరించిన విధానం కూడా బాగుంది. ఓవరాల్ గా కాస్త లేట్ గా చూసినా కూడా “ఆమె” అందర్నీ ఆశ్చర్యపరచడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus