భయపెడుతున్న రానా కొత్త లుక్.. మరీ ఇలా అయిపోయాడేంటి?

  • October 1, 2019 / 07:26 PM IST

‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రంలో రానాని చూసిన వారెవరైనా సరే… నిజంగా హల్క్ లా ఉన్నాడే అని అనుకోక మానరు. అందులో మన భల్లాల దేవుడు అలా ఉంటాడు మరి. కండలు తిరిగిన శరీరంతో… దున్నపోతు తల బద్దలు కొడుతుంటే.. ‘వావ్’ అనని వారంటూ ఉండరు. అంతేనా ఆ చిత్రంలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ఇండియా అంతా పాపులర్ అయిపోయాడు. అయితే ‘బాహుబలి2’ లో మాత్రం అంత బాడీ లేదనే చెప్పాలి. ఒకరకంగా ఆ చిత్రంలో చాలా నీరసంగా కనిపిస్తాడు రానా.

అయితే రానా ఆరోగ్యం దెబ్బతిందని అప్పటి నుండీ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ మధ్య అయితే రానాకీ ఓ కిడ్నీ దెబ్బ తిందని.. వెంటనే ఆయనకు వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని… ‘డోనర్’ కోసం వెయిట్ చేస్తున్నారని… ఇక డోనర్ కూడా దొరికాడని.. విదేశాల్లో ఆపరేషన్ కోసం వెళ్లాడని… ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ రానా మాత్రం ఆ వార్తలని ఖండిస్తూనే వస్తున్నాడు. ఇక కొంతకాలంగా రానా యుఎస్ లో ఉంటున్నాడు. తాజాగా రానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో రానా అభిమానులని భయపెడుతున్నాడు. ఈ ఫొటోలో రానా చాలా బక్కగా అయిపోయి.. ఒక రకంగా పేషెంట్ లా ఉన్నాడు. ఈ ఫోటోకి సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ‘ఇలా అయిపోయావ్ ఏంటి రానా’, ‘బాబోయ్.. రానా అస్సలు చూడలేకపోతున్నాం’… అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. అయితే రానా ప్రస్తుతం ‘విరాటపర్వం’ అనే చేస్తున్నాడు. అందుకోసమే ఇలా సన్నపడ్డానని గతంలో చెప్పాడు.

‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus