బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స అనేవి హీటెక్కించాయి. ఒకరినొకరు డైరెక్ట్ నామినేట్ చేస్కుంటూ ఒకరి ముఖంపై ఒకరు ఫోమ్ ని కొట్టుకున్నారు. ఇందులో భాగంగా అత్యధికంగా మానస్ కి ఐదు ఓట్లు వచ్చాయి. అంతేకాదు, ఈసారి కెప్టెన్ తప్పించి, హౌస్ మొత్తం నామినేట్ అవ్వడం విశేషం. మానస్ తో పాటుగా సన్నీకి కూడా మూడు ఓట్లు పడ్డాయి వీరిద్దరినే హౌస్ లో టార్గెట్ చేశారా అనే అనిపించింది. దీనికి కారణం కెప్టెన్సీ టాస్క్. ఇంకా పూరీల టాస్క్. పూరీల టాస్క్ లో సన్నీ ఏదైతే సంచాలక్ ని ప్రశ్నించాడో దానికి అనీమాస్టర్ ఫైర్ అయ్యింది. జైల్లో ఉన్న సన్నీ హౌస్ మేట్స్ తో ఆర్గ్యూమెంట్ కి దిగాడు.
ముఖ్యంగా అనీమాస్టర్ తో వాగ్వివాదం చేశాడు. అక్కడే తాపీగా హాయిగా నవ్వుతున్న షణ్ముక్ ని సైతం వదల్లేదు. దీంతో హౌస్ మేట్స్ అందరూ సన్నీని ఈవారం టార్గెట్ చేస్తారనే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా సన్నీకి సపోర్ట్ చేస్తున్న మానస్ ని హౌస్ లో ఐదుగురు నామినేట్ చేశారు. ఇద్దరి ఫ్రెండ్స్ ని టార్గెట్ చేశారు. శ్రీరామ్ , జెస్సీ మానస్ ని, సన్నీని ఇద్దర్ని నామినేట్ చేశారు. సిరి సన్నీని నామినేట్ చేసింది. దీంతో సన్నీకి మూడు ఓట్లు పడ్డాయి. ర్వాత మానస్ ని రవి, విశ్వ, షణ్ముక్ లు సైతం నామినేట్ చేశారు. దీంతో ఐదు ఓట్లు మానస్ కి వచ్చాయి. నిజానికి గతంలో హౌస్ మేట్స్ కి మానస్ కి మంచి ర్యాపో ఉండేది.
మానస్ అంటే హౌస్ అంతా కూడా ఇష్టపడేది. అయితే, రీసంట్ గా జరిగిన రెండు మూడు టాస్క్ లలో సన్నీకి సపోర్టింగ్ గా మారాడు మానస్. దీంతో హౌస్ మేట్స్ కి ఆవిషయం నచ్చడం లేదు. అందుకే, మానస్ ని టార్గెట్ చేశారా అని అనిపిస్తోంది. మరోవైపు పూరీల టాస్క్ అప్పుడు కూడా సన్నీ ఆర్గ్యూమెంట్ చేస్తుంటే, మీరు కూడా ఐదుగురు గ్రూప్ అని మానస్ అన్నాడు. ఇది కూడా ఎవరికీ నచ్చలేదు. అందుకే మానస్ ని టార్గెట్ చేశారు. ఇక 9వ వారం నామినేషన్స్ లో మొత్తం 10మంది ఉన్నారు. వీరికోసం ఇమ్యూనిటీని పొందేందుకు ప్రత్యేకమైన టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. మరి ఇందులో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.