బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం నామినేషన్స్ అత్యంత నాటకీయంగా జరిగాయి. ముఖ్యంగా శివని టార్గెట్ చేస్తూ హౌస్ మేట్స్ ఛేదు లడ్డూలు తినిపించారు. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేస్తూ వాళ్లకి ఛేదు లడ్డూలు తినిపించాలి. వాళ్లలో ఉన్న లోపాలని ఎత్తి చూపాలి. సరైన కారణాలని చెప్పాలి. ఇక్కడే హౌస్ మేట్స్ శివని టార్గెట్ చేశారు. అషూరెడ్డి విషయంలో యాంకర్ శివ వాష్ రూమ్ లో బటన్స్ తీయి అని నాలుగుసార్లు అన్న మాటలకి అషూ బాగా హర్ట్ అయ్యింది.
ఇన్నర్స్ కోసం అలా మాట్లాడాను అని, నా ఇంటెన్షన్ అది కాదని శివ క్లియర్ గా చెప్పాడు. అలాగే, అషూరెడ్డి కూడా నీ అభిప్రాయం అది కాదు కానీ, నేను మాత్రం ఫీల్ అయ్యాను అంటూ వీకెండ్ నాగార్జున ముందు మాట్లాడింది. దీంతో శివ అషూకి సారీ చెప్పాడు. కానీ, మనస్పూర్తిగా గిల్టీగా ఫీల్ అవ్వలేదని మరోసారి అషూ మార్నింగ్ ఈ ఇష్యూని బయటకి తీస్కుని వచ్చింది. శివ నాతో మాట్లాడటం లేదని, అతను మనస్పూర్తిగా సారీ చెప్పలేదని అభిప్రాయపడింది.
ఇదే విషయాన్ని మరోసారి నామినేషన్స్ లో పాయింట్ అవుట్ చేసింది. ఇక శివ నేను ఫీల్ అయ్యానో లేదో మీకు తెలియదు కదా, కాస్త సమయం పడుతుంది అంటూ మాట్లాడాడు. అంతేకాదు, బిందుమాధవితో షేర్ చేసుకున్న మాటలని బిందు మాధవి విని కూడా తనని నామినేట్ చేయడంతో ఫీల్ అయ్యాడు శివ. నేను నీతో షేర్ చేసుకున్నందుకు నామినేట్ చేశావా.. లేదా నా విషయం నిజంగానే తప్పు అనిపించి నామినేట్ చేశావా అంటూ క్లియర్ గా అడిగాడు.
దీంతో నువ్వు చేసింంది తప్పు అని, ఇంకా రియలైజ్ అవ్వకపోతే కష్టమని క్లారిటీగా చెప్పింది బిందు. ఈవిషయంలో హౌస్ లో ఇంకొందరు శివని నామినేట్ చేశాడు. దీంతో ఛేదు లడ్డూలు శివకి ఎక్కువగానే వచ్చాయి. అసలు ఒక లడ్డూనే తినడం కష్టమైతే ఐదారు లడ్డూలు తినాల్సి వచ్చింది. మరోవైపు అషూరెడ్డికి కూడా గట్టిగానే నామినేషన్స్ పడ్డాయి. దీంతో అషూకూడా ఛేదు లడ్డూలు తినాల్సి వచ్చింది. ఇద్దరూ కూడా ఛేదు లడ్డూలు తినలేక ఛచ్చారు.
మద్యమద్యలో నీళ్లు తాగుతూ ఎలాగోలా కొద్దిగా లడ్డులని తిన్నాడు శివ. తను చేసిన పనికి ఇప్పుడు రియలైజ్ అయ్యి నెక్ట్స్ టాస్క్ ఎలా ఆడతాడు అనేది చూడాలి. మొత్తానికి అదీ మేటర్.