నందమూరి తారక రామారావు గారి కొడుకులు చాలా మంది సినిమాల్లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఎవ్వరూ నిలబడలేదు. ఒక్క బాలకృష్ణని మాత్రమే నందమూరి అభిమానులు ఓన్ చేసుకున్నారు. అలా అని బాలయ్య మొత్తం తన తండ్రి పై ఆధారపడి కథల్ని ఎంపిక చేసుకోలేదు. ఆయనకు నచ్చిన, కథలు పాత్రలు ఎంపిక చేసుకుని సూపర్ హిట్లు అందుకున్నారు. అందుకే స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటికీ రాణిస్తున్నారు.
అయితే నందమూరి తారక రామారావు గారి రిఫరెన్స్ ఎంతో కొంత బాలకృష్ణకి పనికొచ్చింది అనే చెప్పాలి. ఇక సీనియర్ ఎన్టీఆర్ మూడో తరం హీరోల్లో జూ.ఎన్టీఆర్ మాత్రమే నిలబడ్డారు. బాలయ్య తర్వాత ఎన్టీఆర్ ను బాగా ఓన్ చేసుకున్నారు నందమూరి అభిమానులు. ఇంకా చెప్పాలి అంటే నందమూరి బాలకృష్ణని మించే ఎన్టీఆర్ ను ఓన్ చేసుకున్నారు అన్నా అతిశయోక్తి లేదు.
ఇది పక్కన పెడితే.. బాలకృష్ణ 60లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయ్యింది. తన కొడుకు మోక్షజ్ఞ కి 27ఏళ్ళ వయసు వచ్చింది. కాబట్టి మోక్షజ్ఞని వీలైనంత త్వరగా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్యకి చాలా సార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి. బాలకృష్ణ నటించే ప్రతీ సినిమా షూటింగ్ స్పాట్ కు మోక్షజ్ఞ వెళ్తుంటాడు. అతని ఎంట్రీ గురించి ఆ చిత్ర యూనిట్ లు ప్రశ్నిస్తూనే ఉంటాయి. కానీ బాలయ్య మాత్రం సరైన సమాధానం చెప్పడం లేదు.
మోక్షజ్ఞని అడిగితే నాన్నగారి ఇష్టం అంటూ ఓ చిన్న మాట వదిలి నవ్వేసి వెళ్ళిపోతున్నాడు. అభిమానులు మాత్రం మోక్షజ్ఞ ప్రతీ పుట్టినరోజుకి పనిగట్టుకుని ఇంటికి వెళ్లి అతనితో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే.. అతని డెబ్యూకి ఏ కథైతే బాగుంటుంది అనే విషయం బాలయ్య ఎంత ఆలోచిస్తున్నాడో తెలీదు కానీ.. వారి అభిమానులు మాత్రం బాలయ్య నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను రిఫరెన్సులుగా చూపించి ఇలాంటి సినిమాలు అయితే బాగుంటాయి అంటున్నారు.
ఓ స్టార్ హీరో కొడుకు హీరోగా లాంచ్ అయ్యేప్పుడు అభిమానుల్లో బోలెడన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గ కథని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే మోక్షజ్ఞ డెబ్యూ విషయంలో అభిమానులు ఆసక్తి చూపిస్తున్న కథలు ఎలా ఉన్నాయి అన్నది బాలయ్య నటించిన కొన్ని సూపర్ హిట్ సినిమాల ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ఆదిత్య 369 :
సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1991 వ సంవత్సరంలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇలాంటి మూవీ లేదా దీనికి సీక్వెల్ లో మోక్షజ్ఞ నటిస్తే బాగుంటుంది అని అభిమానులు భావిస్తున్నారు.
2) మంగమ్మ గారి మనవడు :
కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీ 1984 వ సంవత్సరంలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇలాంటి కమర్షియల్ మూవీతో మోక్షజ్ఞ డెబ్యూ ఇస్తే బాగుంటుంది అని కొంతమంది అభిమానుల అభిప్రాయం.
3) భైరవద్వీపం :
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య నటించిన మరో సూపర్ హిట్ మూవీ ఇది. ఈ మూవీ కథని కొన్ని మార్పులు చేసి మోక్షజ్ఞతో డెబ్యూ మూవీగా చేస్తే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం. 1994 వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
4) టాప్ హీరో :
ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం 1994 వ సంవత్సరంలో విడుదలై ప్లాప్ అయ్యింది. కానీ ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. బుల్లితెర పై ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ కథకి కొన్ని మార్పులు చేసి మోక్షజ్ఞతో తీస్తే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు.
5) నిప్పు రవ్వ :
ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మూవీ ఇది. 1993వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. కానీ ‘కె.జి.ఎఫ్’ రేంజ్లో ఉంటుంది ఈ చిత్రం కథ. ఇలాంటి పవర్ సబ్జెక్టు తో మోక్షజ్ఞ డెబ్యూ ఇస్తే బాగుంటుంది అని కొందరి అభిమానుల కోరిక.
6) సీతారామ కళ్యాణం :
జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ ఇది.1986 వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇది లవ్ స్టోరీ అయినప్పటికీ ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఢోకా ఉండదు. ఇలాంటి కథతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చినా బాగుంటుంది.
7) రౌడీ ఇన్స్పెక్టర్ :
బాలకృష్ణ- బి.గోపాల్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ఇది. 1992 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇది. దేనిని కనుక మోక్షజ్ఞతో రీమేక్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
8) లారీ డ్రైవర్ :
బాలకృష్ణ- బి.గోపాల్ కాంబినేషన్లో తెరకెక్కిన మరో సూపర్ హిట్ మూవీ ఇది. 1990లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీ కథ కనుక మోక్షజ్ఞతో చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇంత మాస్ పెర్ఫార్మన్స్ అతను మొదటి సినిమాతో ఇవ్వగలడా అనేది పెద్ద ప్రశ్న.
9) లక్ష్మీ నరసింహ :
జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో బాలయ్య నటించిన ఇలాంటి సూపర్ హిట్ మూవీ కూడా బాలయ్యకి బాగానే ఉంటుంది.
10) వంశానికొక్కడు :
సీనియర్ దర్శకుడు శరత్ దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ మూవీ కూడా 1996లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ కథ కూడా మోక్షజ్ఞ డెబ్యూ కి సూట్ అవుతుంది అని కొందరు భావిస్తున్నారు.