‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్.. ‘పుష్ప’ తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అప్పటివరకు తెలుగు, మలయాళంలోనే రిలీజ్ అయ్యేవి తన మూవీస్.. ఫస్ట్ టైం పాన్ ఇండియా రిలీజ్ అయినా కానీ సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టడమే కాక.. 2021లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది ‘పుష్ప’.. వరల్డ్ వైడ్ ఆడియన్స్ పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీక్వెల్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది..
సోషల్ మీడియాలోనూ బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.. తనకి సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను తెలుసుకోవడానికి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ‘పుష్ప’కి బన్నీ అక్షరాలా 60 కోట్ల పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయి.. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ లగ్జీరియస్ లైఫ్ స్టైల్ గురించి, తన దగ్గరున్న ఖరీదైన 12 వస్తువుల గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1. లావిష్ హౌస్..
జూబ్లీ హిల్స్‌లో బ్లెస్సింగ్ పేరుతో సాలిడ్ లావిష్ హౌస్ ఉంది బన్నీకి.. దీని విలువ 60 నుండి 80 కోట్ల వరకు ఉంటుంది. అలాగే కోకాపేట్‌లో 50 కోట్ల విలువ చేసే కొన్ని ఎకరాల స్థలం కూడా ఉంది..
2. ఫాల్కన్ వానిటీ వ్యాన్..
సెలబ్రిటీల్లో చాలా తక్కువ మందికి ఓన్ కారవాన్ ఉంటుంది.. అలాగే బన్నీ తన టేస్టుకి తగ్గట్టు మంచి ఫెసిలిటీస్‌తో ఓ ఫాల్కన్ వానిటీ వ్యాన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. దీని కాస్ట్ 7 కోట్లు..
3. బెంట్లీ కాంటినెంటల్ కార్..
ఐకాన్ స్టార్ ఓసారి ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్తూ.. బెంట్లీ కాంటినెంటల్ కార్‌లో కనిపించాడు.. దీని ధర 3.29 కోట్లు..
4. రేంజ్ రోవర్ వోగ్..
‘పుష్ప’ బ్లాక్ బస్టర్ తర్వాత రూ. 3 నుండి 4 కోట్ల వరకు ఉండే లగ్జరీ రేంజ్ రోవర్ వోగ్ కొన్నాడు అల్లు అర్జున్..
5. జాగ్వార్ ఎక్స్‌జెఎల్..
తన దగ్గరున్న కార్లలో జాగ్వార్ XJL వైట్ కార్ కూడా ఒకటి.. దీనికి బన్నీ ఫేవరెట్ లక్కీ నంబర్ 0666 ఉంటుంది. 1.2 కోట్లు..
6. బీడబ్స్ ఫ్రాంఛైజీ..
సొంతంగా B.DUBS రెస్టారెంట్ ఫ్రాంఛైజీ ఉంది.. దీని నెట్ వర్త్ 1 నుండి 2 కోట్ల వరకు ఉంటుంది..
7. అల్లు అర్జున్ హమ్మర్ H2..
తన దగ్గర 85 నుండి 95 లక్షల కాస్ట్ ఉండే హమ్మర్ H2 బీస్ట్ కార్ కూడా ఉంది..
8. బ్రెయిట్లింగ్ నావిటిమర్ వాచ్..
15 లక్షల ఖరీదు చేసే బ్రెయిట్లింగ్ నావిటిమర్ B01 క్రోనోగ్రాఫ్ (Breitling Navitimer B01 Chronograph) అనే స్టైలిష్ వాచ్ ఉంది..
9. హబ్లాట్ బిగ్ బ్యాంగ్ స్టీల్ కార్బన్..
అల్లు అర్జున్ మరో సందర్బంలో హబ్లాట్ బిగ్ బ్యాంగ్ స్టీల్ కార్బన్ (Hublot Big Bang Steel Carbon) చేతి గడియారంతో కనిపించాడు.. దీని విలువ రూ. 10.25 లక్షలు..
10. కార్టియర్ శాంటాస్ 100XL..
ఐకాన్ స్టార్ ధరించే కార్టియర్ శాంటాస్ 100XL (Cartier Santos 100XL) మోడల్ వాచ్ కాస్ట్.. రూ.4.44 లక్షలు..
11. బ్రెయిట్లింగ్ అవెంజర్ హరికేన్ 45..
బన్నీ దగ్గర బ్రెయిట్లింగ్ బ్రాండ్‌లో మరో మోడల్ కూడా ఉంది.. అదే బ్రెయిట్లింగ్ అవెంజర్ హరికేన్ 45 (Breitling Avenger Hurricane 45) దీని కాస్ట్ రూ.4.51 లక్షలు..
12. ఫేవరెట్ నంబర్ 0666..
బన్నీకి 0666 అనేది లక్కీ అండ్ ఫేవరెట్ నంబర్.. తన దగ్గరున్న అన్నీ వెహికల్స్‌కి ఇదే నంబర్ ఉంటుంది.. ఈ 0666 నంబర్ కోసం కోట్లలో ఖర్చు చేస్తుంటాడు ఐకాన్ స్టార్..