సంక్రాంతి కానుకగా విడుదలైన వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్2’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా సక్సెస్ అందుకుంది. గత సంవత్సరం వరుస డిజాస్టర్లతో డీలా పడిపోయిన దిల్ రాజుకి ఈ చిత్రం మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. సంక్రాంతి అల్లుళ్ళు చేసిన కామెడీకి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. రాంచరణ్ ‘వినయ విధేయ రామా’, బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, రజినీకాంత్ ‘పేట’ చిత్రాల మధ్యలో విడుదలవుతున్న ఈ చిత్రం కనీసం బ్రేక్ ఈవెన్ అవుతుందా అని అంతా అనుకున్నారు. కానీ ఈ ఒక్క చిత్రం మాత్రమే సంక్రాంతికి సందడి చేసింది. అంతే కాదు ఈ సంవత్సరం గడిచిన మొదటి ఈ మూడు నేలల్లోనూ ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం విశేషం. ఫైనల్ గా ఈ చిత్రం 81.05 కోట్ల షేర్ ని వసూల్ చేసి టాలీవుడ్ ‘ఆల్ టైం టాప్ 8’ ప్లేస్ ను దక్కించుకుంది. ఇక ‘ఎఫ్2’ ఏరియా వైజ్ క్లోజింగ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం – 22.80 కోట్లు
సీడెడ్ – 8.70 కోట్లు
వైజాగ్ – 10.50 కోట్లు
ఈస్ట్ – 7.0 కోట్లు
వెస్ట్ – 4.30 కోట్లు
గుంటూరు – 5.60 కోట్లు
కృష్ణా – 5.20 కోట్లు
నెల్లూరు – 2.05 కోట్లు
ఓవర్సీస్ – 9.30 కోట్లు
కర్ణాటక +
రెస్ట్ ఆఫ్ ఇండియా – 5. 60
—————————————————
టోటల్ : 81.05 కోట్లు (66.7 కోట్ల గ్రాస్)
——————————————————–
ఈ చిత్రానికి 32 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా… క్లోజింగ్ కలెక్షన్లు 81.05 కోట్ల షేర్ ని రాబట్టింది, అంటే రెండింతలకు పైనే లాభాలు తెచ్చిపెట్టిందన్న మాట. ఈ చిత్రం ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టడం విశేషం. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ చిత్రం ‘ఆల్ టైం టాప్ 7’ చిత్రంగా నిలువగా… ఆ తరువాతి స్థానం అంటే టాప్ 8 వ ప్లేస్ లో ‘ఎఫ్2’ నిలిచింది. అటు వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ చిత్రం కావడం విశేషం.