మగధీరను టాప్ 10 లిస్ట్ నుంచి వైదొలగేలా చేసిన ఎఫ్2

రామ్ చరణ్ కెరీర్ లో మరపురాని చిత్రాల్లో “మగధీర” ఒకటి. ఒకప్పటి ఇండస్ట్రీ హిట్ అయిన ఆ సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చేయడానికి వేరే హీరోలకి చాలా టైమ్ పట్టింది. ముఖ్యంగా.. ఆ సినిమా వైడ్ కలెక్షన్స్ ను ఇప్పటివరకూ క్రాస్ చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. సో, టాప్ గ్రాసర్ లిస్ట్ లో మగధీర టాప్ 10లో ఎప్పట్నుంచో ఉంటూనే ఉంది. అయితే.. రంగస్థలం, భరత్ అనే నేను విడుదల తర్వాత మగధీర స్థానం 10వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు ఆ 10వ స్థానం కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన “ఎఫ్ 2” చిత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం వచ్చే వారానికి 100 కోట్ల షేర్ వసూలు చేయడం ఖాయమని అంటున్నారు. అదే గనుక జరిగితే మగధీర 10వ స్థానం కూడా కోల్పోయి.. ఓవరాల్ గా టాప్ గ్రాసర్ లిస్ట్ లో నుంచి తొలగించబడుతుంది. ఆ విధంగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ కారణంగానే చరణ్ రికార్డ్ బ్రేక్ చేయబడడమే కాక ఏకంగా టాప్ గ్రాసింగ్ మూవీస్ లీస్ట్ నుంచి తొలగించబడింది కే‌యూ‌డి‌ఏ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus