వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. 2019 లో వచ్చిన ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు. సోనాల్ చౌహాన్ ,మురళీ శర్మ, సునీల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో మొదటినుండీ ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మే 27న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ వీక్ మంచి కలెక్షన్లను రాబట్టింది. రెండో వారంలో మేజర్,విక్రమ్ ల ఎంట్రీతో కాస్త తగ్గాయి.
‘ఎఫ్ 3’ 9 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
16.76 cr
సీడెడ్
5.51 cr
ఉత్తరాంధ్ర
5.34 cr
ఈస్ట్
2.98 cr
వెస్ట్
2.25 cr
గుంటూరు
2.97 cr
కృష్ణా
2.60 cr
నెల్లూరు
1.62 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
40.03 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.72 cr
ఓవర్సీస్
6.85 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
49.6 cr
‘ఎఫ్3’ మూవీకి రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.49.6 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.14.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి క్రేజీ సినిమాలు విడుదలవడంతో ‘ఎఫ్3’ కలెక్షన్లు తగ్గాయి. అయినప్పటికీ నిన్న కూడా కోటి పైనే షేర్ ను రాబట్టింది. ఇలాగే స్టడీగా రాణిస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.