‘పుష్ప’ సినిమాలో ఫహద్ ఫాజిల్ గెటప్ గురించి మనం నిన్ననే ఓ మాట అనుకున్నాం. నెటిజన్ల కామెంట్లను పరిశీలిస్తే ఆ విషయం తెలిసింది. ఫహద్ ఫాజిల్ మార్క్ అయిన హాఫ్ బాల్డ్ హెడ్ లేకుండా పూర్తి గుండు ఎందుకు చేసేశారో అనేది ఆ కామెంట్ల సారాంశం. అయితే భన్వర్ సింగ్ షెకావత్ లుక్ నిజం కాదట. ఈ లుక్ కోసం ఫహద్ ఫాజిల్ చాలా కష్టాలే పడ్డాడట. గుండు గెటప్ కోసం అంత కష్టమేముంటుంది అంటారా. చాలానే ఉంది.
ఫహద్ ఫాజిల్ ఇప్పుడు మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్. ఒక సినిమా తర్వాత ఒక సినిమా, రోజుకో సెట్ అనే కాన్సెప్ట్‌లో పని చేస్తున్నాడు. అలాంటిది ‘పుష్ప’ సినిమా కోసం గుండు గీసుకుంటాడు అంటారా? ఈ ప్రశ్నకు ‘పుష్ప’ టీమ్ నుండి ఆసక్తికర సమాధానం వచ్చింది. అదే మేకప్. అవును ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా ఫహద్‌ను గుండులా చూపించారట. వేరే సినిమా షూటింగ్‌కి ఇబ్బంది లేకుండా ఇలా చేశారని అంటున్నారు.
ప్రోస్థెటిక్ మేకప్ అంటే చిన్న విషమేమీ కాదు. దాని కోసం గంటలు తరబడి సమయం వెచ్చించాలి. ఈ మేకప్ కోసం గంటల సమయం పడుతుందని చాలా సందర్భాల్లో నటులు చెప్పడం వినే ఉంటారు. ఇప్పుడు ఫహద్ ఫాజిల్ పరిస్థితి కూడా అంటే. అంతేకాదు ఈ మేకప్ వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి అంటారు. సినిమా కోసం, నటన కోసం ఎంతకైనా సిద్ధపడే ఇలాంటి నటులు మనకు చాలా అరుదు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!