కమల్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?

స్టార్ హీరో కమల్ హాసన్ తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటించారు. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇతర హీరోలు చేయలేదనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొన్నాళ్లుగా ఆయన సినిమాలకు దూరమై.. రాజకీయాలు, ఇతర విషయాలపై ఆయన దృష్టి పెడుతున్నారు. ఇక ఆయన సినిమాల్లో నటించారేమో అనే నిరాశలో ఉన్న సమయంలో ఇండియన్ 2 సినిమాను మొదలుపెట్టారు. కానీ ఈ సినిమా మొదలైన దగ్గర నుండి ఏదొక ఆటంకం కలుగుతూనే ఉంది. అసలు ఈ సినిమాను పూర్తి చేస్తారా..? లేదా..? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.

అయితే ఈ మధ్యనే ‘విక్రమ్’ అనే టైటిల్ తో తన కొత్త సినిమాను ప్రకటించి అభిమానులను ఖుషీ చేశాడు కమల్. విలక్షణ దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తోన్న ఈ సినిమా టీజర్ ని ఇటీవలే విడుదల చేశారు. ఇది చూసిన ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలనుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో సినిమాను రూపొందించనున్నారు. అయితే ఇలాంటి సినిమాలో కమల్ కి విలన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆయన ముందు ధీటుగా నిలబడే ఈ తరం నటులెవరా అని చూస్తున్న సమయంలో మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ ని ఎంపిక చేసి ఆశ్చర్యపరిచారు. నటుడిగా తన సత్తా చాటిన ఫాహద్ ఇప్పుడు కమల్ సినిమాలో విలన్ గా నటిస్తుండడం విశేషం. గత దశాబ్ద కాలంలో ఇండియన్ సినిమాలో ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫాహద్ ఫాజిల్ ఒకరు. కమల్ ని ఎదుర్కొనే విలన్ పాత్రలో ఇతడు నటిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు!

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus