ఎవరూ ఊహించని, ఆశించని పరిస్థితుల్లో భారీ హిట్ కొట్టడం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి (Puri Jagannadh) అలవాటు. గతంలో ఇలాంటి ఫీట్స్ ఆయన చాలా సందర్భాల్లో చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఫీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా చర్చ పెడుతూనే ఉన్నారు. దీనికి కారణం ఆయన అనౌన్స్ చేసిన కొత్త సినిమానే. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా పూరి జగన్నాథ్ సినిమా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ చర్చ జరుగుతుండగానే మరో హీరో డిస్కషన్‌లోకి వచ్చాడు. ఆయనే ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil). అవును.. పూరి జగన్నాథ్‌తో ఫహాద్ ఫాజిల్ సినిమా అంటూ గత రెండు రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూరితో ఓ సినిమా చేస్తానని ఫహాద్ ఫాజిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ వార్తల సారాంశం. అయితే హీరోగా ఆ సినిమా చేస్తారా? లేదా కీలక పాత్ర చేస్తారా అనేదే ఇక్కడ పాయింట్.
ఎందుకంటే విజయ్ సేతుపతి సినిమాలో ఫహాద్‌ను విలన్‌గా ఎంపిక చేశారు అనే డౌట్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి లాంటి పవర్ హౌస్‌కి.. ఫహాద్ అయితే కరెక్ట్ అని పూరి భావించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఫహాద్ ఫాజిల్ లైనప్‌లో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు హీరోగా ఫహాద్ నటించడం కష్టమే. కాబట్టి కీలక పాత్ర అని అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే టబును ఓ ముఖ్య పాత్ర కోసం తీసుకున్నారు.
అలాగే హీరోయిన్‌గా రాధికా ఆప్టేను (Radhika Apte) కథానాయికగా ఎంచుకున్నారు అని వార్తలొస్తున్నాయి. త్వరలో మొత్తం కాస్ట్ అండ్ క్రూను అనౌన్స్ చేస్తారు అని చెబుతున్నారు. ‘లైగర్’,(Liger) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) సినిమాలతో వరుస పరాజయం అందుకున్న పూరి జగన్నాథ్‌కు ఈ సినిమా చాలా కీలకం.