మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అలాగని స్పీడ్ తగ్గించడం లేదు. ఇటీవల, రవితేజ భాను భోగవరపు దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది భాను భోగవరపుకి దర్శకుడిగా మొదటి సినిమా కావడంతో, రవితేజ ఈ యంగ్ డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చి దర్శకుడిగా ప్రమోషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌పై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలతో ఉన్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటిస్తుండడం, సినిమా మీద ఆసక్తి మరింత పెంచింది.
ఇదిలా ఉంటే, రవితేజ తన ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన తరువాత కొన్ని సరికొత్త ప్రాజెక్ట్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే, మలయాళీ హిట్ మూవీ ‘ఆవేశం’ (Aavesham) రీమేక్ రైట్స్‌ను రవితేజ స్వయంగా కొనుగోలు చేశారని సమాచారం. ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మలయాళంలో భారీ విజయాన్ని సాధించి, 100 కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టింది. అందులో ఫాహద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
‘ఆవేశం’ను తెలుగులో రీమేక్ చేయడానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపారు. కానీ, చివరికి ఈ ప్రాజెక్ట్ రవితేజ చేతికి వచ్చింది. అయితే ఈ రీమేక్‌లో రవితేజ ఫాహద్ ఫాజిల్ పాత్రను స్వయంగా చేయాలనుకుంటున్నారా లేదా మరో యంగ్ హీరోతో ప్రాజెక్ట్‌ని తీసుకెళ్లాలనుకుంటున్నారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. రవితేజ తన ప్రత్యేక శైలిని జోడించి ఈ పాత్రకు కొత్తతనం తీసుకురావాలని భావిస్తున్నట్లు అనుకుంటున్నారు.
ఒకవేళ యంగ్ హీరోతో ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే, ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో సోషల్ మీడియాలో బాగా చర్చలు జరుగుతున్నాయి. రవితేజ, తన స్టైల్ ఎనర్జీని సినిమాలో జోడించడం, ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.