‘జగడం’ లా సాగిన ‘ఫలక్ నుమా దాస్’ ట్రైలర్

చిన్నప్పటి నుండీ గ్యాంగ్ వార్ ల మీద ఆసక్తి పెంచుకున్న దాస్(విశ్వక్ సేన్) ఫలక్ నుమాలో తిరుగులేని లీడర్ గా ఎదగాలని ఓ గోల్ పెట్టుకుంటాడు. ఇందుకు తన స్నేహితులు కూడా తోడవుతారు. గల్లీలో మటన్ వ్యాపారం చేసుకుంటూ .. ఎదురొచ్చిన వాళ్ళతో తో గొడవ పెట్టుకొవడం, ఇక అక్కడ అదే వ్యాపారం చేస్తున్న వాళ్ళతో కూడా వివాదాలు పెట్టుకోవడం జరుగుతుంటాయి. ఈ మధ్యలో హీరోగారి ప్రేమ కథ. ఇదే మెయిన్ పాయింట్ గా ‘ఫలక్ నుమా దాస్’ ట్రైలర్ సాగింది.

ఇక ఈ ట్రైలర్ ఆరంభంలో మనకి రామ్, సుకుమార్ ల ‘జగడం’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. కంటెంట్ బోల్డ్ గా ఉంది అనిపించాలని కాస్త బూతులు పెట్టేసారు. బస్తీ జీవితాన్ని సహజంగా చిత్రీకరించినట్టున్నారు. హీరో విశ్వక్ సేన్ న్యాచురల్ గా నటించడానికి ట్రై చేసాడు. ఉత్తేజ-తరుణ్ భాస్కర్ తప్ప తెలిసిన నటీ నటులు ఎవరూ లేరు. వివేక్ సాగర్ సంగీతమందించిన ఈ చిత్ర ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశాడు. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటూ మరో మూడు బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ‘ఫలక్ నుమా దాస్’ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus